హెచ్‌డీఎఫ్‌సీలో చైనా బ్యాంక్ వాటాలు పెంపు

13 Apr, 2020 12:26 IST|Sakshi

సాక్షి,  ముంబై : భారత్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ సంస్థలో చైనా సెంట్రల్ బ్యాంక్  తన వాటాలు పెంచుకుంది. 0.8 శాతం నుంచి 1.01 శాతానికి పెంచినట్లు  బ్యాంకు  వెల్లడించింది.  హెచ్‌డీఎఫ్‌సీ  ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన త్రైమాసిక గణాంకాల ప్రకారం, మార్చి చివరి నాటికి చైనా సెంట్రల్ బ్యాంక్  17.5 మిలియన్ షేర్లను కలిగి ఉంది. దీంతో సోమవారం హెచ్‌డీఎఫ్‌సీ  షేరు 3.5 శాతం ఎగిసింది. మార్కెట్ల బలహీనత నేపథ్యంలో ప్రస్తుతం 1.7 శాతం నష్టంతో కొనసాగుతోంది. మార్చి త్రైమాసికానికి గాను షేర్ల వివరాల ప్రకారం, దేశంలో అతిపెద్ద గృహ తనఖా రుణదాత అయిన హెచ్‌డీఎఫ్‌సీలో(హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్)లో సెంట్రల్ బ్యాంక్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) చైనా సావరిన్ వెల్త్ ఫండ్ సేఫ్ తరపున దాదాపు 1.75 కోట్ల వాటాలను కొనుగోలు చేసింది.  కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పలు కంపెనీలు  భారీగా క్షీణించడంతో చైనాకు చెందిన సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండడం విశేషం. కాగా  కరోనావైరస్ మహమ్మారి , ఆర్ధిక పతనం  ఆందోళనలతో మార్చిలో హెచ్‌డీఎఫ్‌సీ  షేరు విలువ 25 శాతానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. (మరింత బలహీనపడిన రూపాయి)

(కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు)

మరిన్ని వార్తలు