కరోనా నివారణతోనే వృద్ధి: ఆనంద్‌ మహీంద్రా

20 Mar, 2020 09:01 IST|Sakshi

ముంబై: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను అధిగమించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా పలు సూచనలు చేశారు. కరోనా వ్యాప్తి వల్ల చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారు, దినసరి కూలీలపై తీవ్ర ప్రభావం పడవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే రెండో ప్రపంచ యుద్దం తరువాత అమెరికా అమలు చేసిన మార్షల్‌ ప్రణాళిక లాంటి వాటిపై ఆలోచించాలని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక దేశ ప్రణాళిక అమలు చేయడం సాధ్యం కాదని..  ప్రతి దేశం వైరస్‌ను నివారించేందుకు సొంత ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ పై ప్రతి దేశం యుద్ధం ప్రకటించి ప్రజలను కాపాడాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని నివారించగలిగితే అంతర్జాతీయ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

చదవండి: బర్గర్లకు బదులు సమోసాలు పెట్టండి : ఆనంద్‌ మహీంద్రా

మరిన్ని వార్తలు