స్టాక్‌ మార్కెట్లకు గ్లోబల్‌ షాక్‌

7 Jun, 2019 10:04 IST|Sakshi

ముంబై : గ్లోబల్‌ మార్కెట్ల పతనంతో పాటు, ట్రేడ్‌వార్‌ ఆందోళనలతో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల బాటపట్టాయి. ఆర్థిక వ్యవస్ధ స్ధిరీకరణకు చర్యలు చేపడతామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ భరోసా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయలేకపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్ల పైగా నష్టంతో 40వేల పాయింట్ల దిగువన, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 12 వేల పాయింట్ల దిగువన ట్రేడవుతున్నాయి. ఇక ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, మారుతి సుజుకి, కొటాక్‌ బ్యాంక్‌, హెచ్‌యూల్‌ తదితర షేర్లు నష్టపోతుండగా, ఇండియాబుల్స్‌ , వేదాంత, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడుతున్నాయి.

మరిన్ని వార్తలు