ఎక్సైడ్ లైఫ్ నుంచి స్మార్ట్ టర్మ్ ప్లాన్

20 Jul, 2016 02:06 IST|Sakshi
ఎక్సైడ్ లైఫ్ నుంచి స్మార్ట్ టర్మ్ ప్లాన్

హైదరాబాద్: సమగ్రమైన లైఫ్ కవరేజీ అందించేలా ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తాజాగా స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. టర్మ్ పాలసీ అయినప్పటికీ .. పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో అప్పటిదాకా కట్టిన ప్రీమియంలను పాలసీ వ్యవధి ముగిశాక తిరిగివ్వడం దీనిలో ప్రత్యేకత.  ఇది క్లాసిక్, స్టెప్ అప్, కాంప్రిహెన్సివ్ వేరియంట్లలో లభిస్తుంది.

క్లాసిక్ విధానంలో పాలసీ గడువు పూర్తయ్యాక అప్పటిదాకా కట్టిన వార్షిక ప్రీమియంలకు సరిసమానమైన మొత్తాన్ని అందుకోవచ్చు. ఇక స్టెప్‌అప్ విధానంలో వార్షిక ప్రీమియంల కన్నా 150 శాతం దాకా పొందవచ్చు. కాంప్రహెన్సివ్ వేరియంట్ ఎంచుకుంటే.. మరింత అధిక బీమా కవరేజితో పొందడంతో పాటు, చెల్లించిన ప్రీమియంలలో కొంత మొత్తాన్ని కూడా మెచ్యూరిటీ సమయంలో అందుకోవచ్చని ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ తివారి తెలిపారు.

మరిన్ని వార్తలు