బంగారాన్ని అందుకు కొంటున్నారా?

15 Apr, 2019 07:33 IST|Sakshi
ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

ఎస్‌బీఐ గోల్డ్‌ఫండ్‌లో 2012లో కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేశాను. ఈ ఫండ్‌కు సంబంధించి గ్రోత్‌ ఆప్షన్‌ డైరెక్ట్‌ ప్లాన్‌ను ఎంచుకున్నాను. ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ ఆరంభంలో ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఆరంభం నుంచే ఈ ఫండ్‌ ఎన్‌ఏవీను గమనిస్తున్నాను. ఈ ఫండ్‌ గరిష్ట ఎన్‌ఏవీ రూ.10.82 మాత్రమే. ఎన్‌ఏవీలో ఎలాంటి  ఎదుగూ, బొదుగూ లేకపోవడం నష్టమేగా! ఈ ఫండ్‌ నుంచి వైదొలగమంటారా?
–ధనుంజయ్, విశాఖపట్టణం 

రాబడుల కోసం పుత్తడిలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టొద్దు. పుత్తడి మంచి వెలుగులు విరజిమ్మింది కొన్ని సంవత్సరాల్లోనే. 2005 నుంచి 2012 సంవత్సరాల వరకూ పుత్తడి ధరలు పెరిగాయి. 2008లో మంచి ధర పలికిన ఒకే ఒక అసెట్‌ క్లాస్‌.. బంగారం మాత్రమే. ఆ ఏడాది అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉండటంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడికి బాగా డిమాండ్‌ పలికింది. ఒక విధంగా చెప్పాలంటే బంగారం... అనుత్పాదక ఆస్తి. చివరి సురక్షిత మదుపు సాధనం కూడా ఇదే. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇది రాణించగలుగుతుంది. లేకుంటే చాలా అధ్వాన పనితీరు చూపించే మదుపు సాధనం కూడా ఇదే. మీరు ఏ ఆస్తిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు, దాని మీద ఎంత రాబడి వస్తుందో అని ఆలోచించాలి. బాండ్లలో పెట్టుబడులు పెట్టినా, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఎస్‌సీ), ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్‌)లో ఇన్వెస్ట్‌ చేసినా, మీకు గ్యారంటీగా కొంత మొత్తంలో రాబడులు వస్తాయి. అదే ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తే, ఆ మేరకు మీకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. అదే రియల్టీలో ఇన్వెస్ట్‌ చేస్తే, ఇల్లు గానీ, స్థలం గానీ మీ పరమవుతుంది. ఇంట్లో మీరు నివసించవచ్చు. లేదా అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. కాలంతో పాటు ఇల్లు, స్థలం విలువలు పెరుగుతాయి. అదే మీరు పుత్తడిలో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. ఇలాంటి ఏ విలువలూ మీకు రావు. ఇది కేవలం విలువ నిల్వకు మాత్రమే పనికొస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర బంగారం ఉంటే, దాని భద్రత కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కూడా. గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఎక్స్‌పెన్స్‌  రేషియో అధికంగా ఉంటుంది కూడా ! బంగారం కేవలం వినియోగం కోసమే, ఆభరణాలు ధరించి ఆనందం పొందడం కోసమే.  పెట్టుబడుల కోసం పుత్తడిని ఎప్పుడూ పరిగణించకూడదు. అందుకని మీ ఈ గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి వైదొలగండి. పుత్తడితో అనుసంధానమున్న ఏ పెట్టుబడి సాధనంలోనూ భవిష్యత్తులో ఇన్వెస్ట్‌ చేయకండి. 

ప్ర: మార్కెట్లో రంగాల వారీ ప్రత్యేక ఫండ్స్‌ చాలా అందుబాటులో ఉన్నాయి కదా! వీటిల్లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను? తగిన సూచనలివ్వండి?     –రమణి, హైదరాబాద్‌  
మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు చాలా మంది ఇన్వెస్టర్లు చేసే మొదటి పని.. వివిధ కేటగిరీల ఫండ్స్‌ పనితీరు ఎలా ఉందో పోల్చి చూడటం. ఇలా మదింపు చేసేటప్పుడు ఒక ప్రత్యేక రంగానికి చెందిన ఫండ్స్‌ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కోసారి రంగాల వారీ (సెక్టోరియల్‌) ఫండ్స్‌ అగ్రభాగంలో ఉండొచ్చు. ఒక్కోసారి అట్టడుగున ఉండొచ్చు. రెండు, మూడేళ్ల  క్రితం ఫార్మా ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు బాగా ఇన్వెస్ట్‌ చేసేవారు. అప్పుడు వాటి పనితీరు కూడా బాగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, వాటి రాబడులు బాగా పడిపోయాయి. చెప్పాలంటే ఈ ఫండ్స్‌ అట్టడుగుకు పడిపోయాయి. సెక్టోరియల్‌ ఫండ్స్‌ ఆ ప్రత్యేక రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఉదాహరణకు ఫార్మా ఫండ్స్‌ అయితే ఫార్మా కంపెనీల్లోనూ, ఇన్‌ఫ్రా ఫండ్స్‌ అయితే ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇలా ఒకే రంగానికి పరిమితమైన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం చాలా రిస్క్‌. పైగా డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు లభించవు. అందుకని రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇలాంటి సెక్టోరియల్‌ ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఒక్కొక్కసారి ఈ సెక్టోరియల్‌ ఫండ్స్‌.. అన్ని ఫండ్స్‌ కంటే కూడా అధికంగా రాబడులనిస్తాయి. అందుకని ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని చాలా మంది టెంప్ట్‌ అవుతుంటారు. ఈ ఫండ్స్‌ అధిక రాబడులు ఇస్తున్నాయంటే, అధిక రిస్క్‌ ఉంటుందని గమనించాలి. ఈ అధిక రాబడులు ఒక విధంగా వార్నింగ్‌ బెల్స్‌గా గుర్తించాలి. 

నేను కొంత మొత్తాన్ని మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా?లేదా ఆల్ట్రా షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్‌ను ఎంచుకోమంటారా?
–పవన్, విజయవాడ

మీరు కొంత మొత్తాన్ని మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే.., ఆల్ట్రా షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే ఉత్తమం. మీకు ఒకింత మంచి రాబడులు వస్తాయి. లిక్విడ్‌ ఫండ్స్, ఆల్ట్రా షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్స్‌కు సంబంధించి రిస్క్‌ ప్రొఫైల్‌లో తేడాలుంటాయి. 91 రోజుల కాలవ్యవధికి మించిన మెచ్యూరిటీ ఉన్న బాండ్లలో లిక్విడ్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేయవు. ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న బాండ్లలో ఆల్ట్రా షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఆల్ట్రా షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత రిస్క్‌ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా అరుదైన సందర్భాల్లోనే నష్టాలు భరించాల్సి రావచ్చు. మొత్తం మీద చూస్తే, మూడు నెలల నుంచి ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్‌ చేయడానికి ఆల్ట్రా షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!