APPకీ కహానీ... స్పెండీ

21 Sep, 2015 02:01 IST|Sakshi
APPకీ కహానీ... స్పెండీ

పర్సనల్ ఫైనాన్షియల్ కార్యకలాపాలను మేనేజ్ చేయడానికి ఈ ‘స్పెండీ’ చక్కగా పనికొస్తుంది. ఇది యూజర్ల ఆదాయ, వ్యయాలను విశ్లేషిస్తుంది. వారు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ ఎక్కువ ఖర్చులవుతున్నాయి? తదితర అంశాల్ని తెలియజేస్తూ మార్గదర్శకత్వం చేస్తుంది. అనువైన ఇంటర్‌ఫేస్, చక్కని ఇన్ఫోగ్రాఫిక్స్ ఈ యాప్ సొంతం. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
ప్రత్యేకతలు
- రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే దీన్ని వాడుకోవచ్చు
- యూజర్ల అభిరుచులకు అనువైన ఆప్షన్లు
- భిన్నమైన అవసరాలకు తగ్గట్టు పలు రకాల వాలెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిక్కొంత ప్రీమియం (నెలకు 2 డాలర్లు, ఏడాదికి 15 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వాలెట్‌నూ మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు కూడా.
- చేసే ప్రతి చెల్లింపూ ఏ ప్రదేశంలో చేస్తున్నామనేది యాడ్ చేసుకోవచ్చు.
- మీరు ఒకవేళ ప్రతి నెలా ఒకరికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉందనుకోండి. ఈ విషయాన్ని మీరు యాప్ రిమైండర్‌లో పెట్టుకోవచ్చు.
- ఈ వారంలో, ఈ నెలలో, మూడు నెలల్లో, ఏడాదిలో ఎంత మొత్తాన్ని ఖర్చు చేశామనే విషయాలను ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూసుకోవచ్చు.

మరిన్ని వార్తలు