వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్

8 Mar, 2016 01:28 IST|Sakshi
వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్

న్యూఢిల్లీ: ఫిచ్ రేటింగ్స్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 8%  వృద్ధిని సాధిస్తుందని  డిసెంబర్‌లో ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ అంచనాలను తాజాగా 7.7%కి తగ్గించింది. అయితే, వృద్ధి విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5% వృద్ధి సాధిస్తుందన్న అంచనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్(జీఈఓ)లో పేర్కొంది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున ఆర్‌బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు