నిరాశ పరిచిన గార్డెన్‌ రీచ్‌ లిస్టింగ్‌ 

11 Oct, 2018 01:04 IST|Sakshi

12 శాతం నష్టంతో లిస్టింగ్‌ 

న్యూఢిల్లీ: గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌ ఆరంగేట్రం నిరాశపరిచింది. ఈ కంపెనీ షేర్‌ బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.118తో పోల్చితే 12 శాతం నష్టంతో రూ.104 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 19 శాతం నష్టంతో రూ.95 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 11 శాతం నష్టంతో రూ.105 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 5.7 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 30 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. బుధవారం మార్కెట్‌ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.1,203 కోట్లుగా ఉంది.

గత నెల 24–అక్టోబర్‌ 1 మధ్య వచ్చిన ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.345 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్, యస్‌ సెక్యూరిటీస్‌లు వ్యవహరించాయి.  నౌకలు తయారు చేసే గార్డెన్‌ రీచ్‌ కంపెనీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత దేశ తొలి యుద్ధ నౌక, ఐఎన్‌ఎస్‌ విజయ్‌ను ఈ కంపెనీ 1961లో తయారు చేసింది. 

మరిన్ని వార్తలు