ఎగుమతులకు ‘గ్లోబల్‌ డిమాండ్‌’ బలం! 

16 Dec, 2017 00:36 IST|Sakshi

నవంబర్‌లో 30 శాతంపైగా వృద్ధి 

కలిసొచ్చిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు, 

జీఎస్‌టీ రిఫండ్‌ ప్రక్రియ సరళీకరణ

దిగుమతులూ 20 శాతం పెరుగుదల

వెరసి 14 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు  

న్యూఢిల్లీ: మెరుగుపడిన అంతర్జాతీయ డిమాండ్‌..  ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. జీఎస్‌టీ రిఫండ్‌ ప్రక్రియ సరళీకరణ వెరసి నవంబర్‌లో భారత్‌ ఎగుమతుల్లో 30.55 శాతం భారీ వృద్ధి నమోదయ్యింది. విలువ రూపంలో ఎగుమతులు 26.19 బిలియన్‌ డాలర్లు. 2016 నవంబర్‌లో భారత్‌ ఎగుమతుల విలువ 20.06 బిలియన్‌ డాలర్లు.  

నిరుత్సాహం నుంచి ఉత్సాహం... 
2016 అక్టోబర్‌ నెలతో పోల్చితే, 2017 అక్టోబర్‌లో ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా 1.12 శాతం క్షీణత (మైనస్‌) నమోదయ్యింది. అంతక్రితం నెల సెప్టెంబర్‌లో ఆరు నెలల గరిష్టస్థాయిలో వృద్ధి నమోదయినా, వెంటనే (అక్టోబర్‌) క్షీణత నమోదుకావడం  అందరినీ నిరాశపరిచింది. అయితే నవంబర్‌లో మంచి వృద్ధి తీరు పట్ల సంబంధిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  
దిగుమతులదీ ఎగువబాటే...: కాగా భారత్‌ దిగుమతులు కూడా నవంబర్‌లో  19.61 శాతం పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం వెలువరించిన గణాంకాలు వెల్లడించాయి. విలువ రూపంలో 40 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది ఇదే నెలలో ఈ విలువ 33.46 బిలియన్‌ డాలర్లు. దీనితో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు 13.82 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  

మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... 
►రత్నాలు – ఆభరణాలు (33 శాతం)  ఇంజనీరింగ్‌ గూడ్స్‌(44 శాతం), ఆర్గానిక్, ఆర్గానిక్‌యేతర రసాయనాలు (54 శాతం), ఫార్మా ప్రొడక్టులు (13 శాతం) ఎగుమతుల్లో చక్కటి వృద్ధి రేటు నమోదయ్యింది.  
►బంగారం దిగుమతులు 26% తగ్గి 3.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
►చమురు దిగుమతులు 39.14 శాతం పెరిగాయి. విలువ రూపంలో 9.55 బిలియన్‌ డాలర్లు. చమురుయేతర దిగుమతులు 14.57 శాతం పెరిగి 30.47 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► చైనా, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్‌ తదితర దేశాలకు ఎగుమతులు పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  

ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ చూస్తే, ఎగుమతులు 12 శాతం పెరిగి 196.48 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 22 శాతం ఎగసి 296 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!