దివాలా ప్రక్రియపై ఐఐసీఏ ప్రత్యేక కోర్సు

16 Feb, 2019 00:47 IST|Sakshi

ముంబై: దివాలా ప్రక్రియ నిర్వహించే నిపుణులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ (ఐఐసీఏ) తాజాగా గ్రాడ్యుయేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రోగ్రాం (జీఐపీ) పేరిట ప్రత్యేక కోర్సు ప్రారంభించింది. రెండేళ్ల ఈ కోర్సుకు దీనికి భారతీయ ఇన్‌సాల్వెన్సీ బోర్డు (ఐబీబీఐ) కూడా ఆమోదముద్ర వేసింది. కార్పొరేట్‌ రంగ నియంత్రణకు సంబంధించి తగు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పలువురు మేధావులతో ఐఐసీఏని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశీయంగా 2,500 మంది దివాలా ప్రొఫెషనల్స్‌ ఉన్నారని, దీనికి డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోందని ఐబీబీఐ చైర్‌పర్సన్‌ ఎంఎస్‌ సాహూ తెలిపారు.  

మరిన్ని వార్తలు