ఉక్కపోతకు అలవెన్స్ కావాల్సిందే

7 Apr, 2016 12:33 IST|Sakshi
ఉక్కపోతకు అలవెన్స్ కావాల్సిందే

చెన్నై : వేసవికాలంలో ఎండలకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బయపడాల్సిన పరిస్థితి. అలాంటిది ఎండ వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేయాలంటే ఉద్యోగులు ఎంత కష్టం. ఈ వేడిని అధిగమిస్తూ పనిచేయడానికి ఉద్యోగులకు చాలా కంపెనీలు పండ్ల రసాలు, మజ్జిగలు అందిస్తుంటాయి. కానీ కంపెనీలు తీసుకునే ఈ చర్యలతో ఉద్యోగులకు కొంత మాత్రమే ఉపశమనం దొరుకుతుంది.

ఈ నేపథ్యంలో వేడిని తట్టుకోలేని ప్రతికూల పరిస్థితులు  ప్రాంతాల్లోని ఫ్యాక్టరీ ఉద్యోగులకు వేడి భత్యం చెల్లించాలని పట్టుబడుతున్నారు. వేడి భత్యం ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాలను అడిగినట్టు రెనాల్డ్ నిషాన్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. యాజమాన్యాలు మాత్రం దీనిపై ఇప్పటి వరకూ ఏమాత్రం స్పందించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎండ వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ భత్యం చెల్లించడం కొత్తమీ కాదని, హ్యుండాయ్ కార్ల తయారీ కంపెనీ ఒక ఉద్యోగికి నెలకు రూ.500 ఇస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. పౌండ్రీ ప్రక్రియల్లో ఎక్కువ వేడి పనులు జరుగుతాయని, అక్కడ మెటల్స్ ను 500 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగించాల్సి ఉంటుందని తెలిపారు. అంతకముందు వరకు ఉద్యోగులను ఫ్యాక్టరీ తీసుకొచ్చే బస్సులు ప్రధాన గేట్ వద్దే దించేవని, అయితే ఇప్పుడు పని ప్రాంతంలో దించేలా చర్యలు తీసుకున్నామని హ్యుండాయ్ కంపెనీ పేర్కొంది.

మే నుంచి క్యాంటీన్ లో కూడా మజ్జిగ పానీయం, నిమ్మరసాలు అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చెన్నైలో ఈ మూడేళ్లలో ఈ ఫిబ్రవరి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.  మార్చిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఈ క్రమంలోనే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న చోట్ల వేడిమి తట్టుకోలేని ఫ్యాక్టరీ ఉద్యోగులు వేడి భత్యాలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు