ట్రేడింగ్‌లో అవకతవకలు.. ఐటీ దాడులు

8 Dec, 2019 03:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ట్రేడింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ పలువురు షేర్‌ బ్రోకర్స్, ట్రేడర్స్‌పై దాడులు జరిపింది. దేశ వ్యాప్తంగా ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ సహా 39 చోట్ల సోదాలు చేపట్టినట్లు ఐటీ శాఖ శనివారం తెలిపింది. రివర్సల్‌ ట్రేడ్స్‌ ద్వారా కృత్రిమంగా లాభం/నష్టం వచ్చేలా చేశారని వీరిపై ఆరోపణలున్నాయి. దీని ద్వారా వీరు రూ. 3500 కోట్ల వరకూ లాభాలు/నష్టాలు వచ్చేలా చేశారని ఐటీ శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు