భారీగా క్షీణించిన ఇన్ఫోసిస్ షేరు!

8 Oct, 2014 13:35 IST|Sakshi
భారీగా క్షీణించిన ఇన్ఫోసిస్ షేరు!
హైదరాబాద్: సిటీ గ్రూప్ డౌన్ గ్రేడ్ చేయడంతో ఐటీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి.  భారత స్టాక్ మార్కెట్ లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ తోపాటు టెక్ మహీంద్ర, మైండ్ ట్రీ, టీసీఎస్, విప్రో కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. 
 
బుధవారం మార్కెట్ లో ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర గ్రూప్ 5 శాతం, మైండ్ ట్రీ, టీసీఎస్, విప్రో 3 శాతానికి పైగా శాతం నష్టపోయాయి. ఇన్ఫోసిస్ కంపెనీ షేరు 5 శాతంతో 173 రూపాయలు క్షీణించి 3,658 వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
ఐటీ రంగాలకు చెందిన కంపెనీ షేర్లు భారీగా క్షీణించడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 26234 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 7841 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 
>
మరిన్ని వార్తలు