మీ పెట్టుబడికి మీరే డ్రైవర్‌! | Sakshi
Sakshi News home page

మీ పెట్టుబడికి మీరే డ్రైవర్‌!

Published Mon, Dec 4 2023 5:55 AM

Best SIP Mutual Funds Plans to Invests of special story - Sakshi

భవిష్యత్‌ లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో నియమబద్ధంగా పెట్టుబడులు పెట్టే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇందుకు నెలవారీ వస్తున్న సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) పెట్టుబడులే నిదర్శనం. 16,928 కోట్లు సిప్‌ రూపంలో అక్టోబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో సిప్‌ ద్వారా వచి్చన గరిష్ట పెట్టుబడులు ఇవి.

అంతేకాదు, ప్రతి నెలా ఈ మొత్తం పెరుగుతూ పోతుండడం, మరింత మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్‌ వైపు అడుగులు వేస్తుండడాన్ని తెలియజేస్తోంది. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో డైరెక్ట్‌ ప్లాన్లు, రెగ్యులర్‌ ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది తెలిసి ఉండాలి.  దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్‌ ద్వారా సంపద సమకూర్చుకోవాలని ఆశించే వారు ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనమో తెలిసి ఉంటే, తమ లక్ష్యం సులువు అవుతుంది.

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రెగ్యులర్‌ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్లు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందిస్తాయి. రెగ్యులర్‌ ప్లాన్‌ అంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ డి్రస్టిబ్యూటర్‌ ద్వారా లేదా బ్రోకర్‌ ద్వారా విక్రయించే ప్లాన్‌. దీనిపై వారికి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలు) నుంచి కమీషన్లు అందుతాయి. కనుక ఎక్స్‌పెన్స్‌ రేషియో (ఇన్వెస్టర్‌ పెట్టుబడి నుంచి ఏటా వసూలు చేసే మొత్తం) రెగ్యులర్‌ ప్లాన్లలో అధికంగా ఉంటుంది.

డైరెక్ట్‌ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. మూడో పక్షం (బ్రోకర్లు, ఫిన్‌టెక్‌ సంస్థలు) కూడా రెగ్యులర్‌ ప్లాన్లను ఆఫర్‌ చేస్తున్నాయి. అయినప్పటికీ వీటిపై కమీషన్‌ చెల్లింపులు ఉండవు. కనుక డైరెక్టర్‌ ప్లాన్లలో ఎక్స్‌పెన్స్‌ రేషియో, రెగ్యులర్‌ ప్లాన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో డైరెక్ట్‌ ప్లాన్లను ప్రవేశపెట్టి పదేళ్లు అవుతోంది. అయినా, ఇప్పటికీ ఎక్కువ మంది పెట్టుబడులు రెగ్యులర్‌ ప్లాన్లలోకే వెళుతున్నాయి. డైరెక్ట్‌ ప్లాన్లలో రాబడులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. రెగ్యులర్‌ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్లలో ఫోలియోలు ఎంతో తక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ప్రతీ ఇన్వెస్టర్‌ వీటి మధ్య వైరుధ్యాన్ని తప్పక తెలిసి ఉండాలి.

అనుకూలతలు...
మ్యూచువల్‌ ఫండ్‌ అడ్వైజర్‌ (సలహాదారు) లేదా పంపిణీదారు (డి్రస్టిబ్యూటర్‌) సేవలు అవసరం లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టే వారికి వ్యయాలు ఆదా చేసుకునేందుకు తీసుకొచి్చందే డైరెక్ట్‌ ప్లాన్లు. సులభంగా చెప్పాలంటే డ్రైవర్‌ సాయం లేకుండా ఎవరి కారును వారు డ్రైవ్‌ చేసుకున్నట్టు. ఇన్వెస్టర్‌ తన పెట్టుబడుల నిర్వహణను తానే చూసుకోవడం. మ్యూచువల్‌ ఫండ్స్‌లో టీఈఆర్‌ అని ఉంటుంది. అంటే టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌). ఇందులో ఫండ్‌ నిర్వహణ చార్జీలు, మార్కెటింగ్‌ వ్యయాలు, రిజిస్ట్రార్‌ ఫీజు, కస్టోడియన్‌ ఫీజు, ఇతర వ్యయాలు కలిపి ఉంటాయి. రెగ్యులర్‌ ప్లాన్లలో పంపిణీదారులకు కమీషన్‌ చెల్లించాల్సి వస్తుంది.

కనుక ఇక్కడ చెప్పుకున్న వివిధ రకాల వ్యయాలకు కమీషన్‌ కూడా తోడు కావడంతో రెగ్యులర్‌ ప్లాన్లలో టీఈఆర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్‌ పెట్టుబడి విలువపై వార్షికంగా టీఈఆర్‌ను అమలు చేస్తారు. కానీ చార్జీ మినహాయింపు ఏరోజుకారోజు కొనసాగుతుంది. పెట్టుబడి నుంచి అధిక వ్యయాలను మినహాయించినప్పుడు ఆ మేర రాబడి తగ్గుతుంది. ఒక ఇన్వెస్టర్‌ రెండు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో రూ.10,000 చొప్పున లమ్సమ్‌గా ఇన్వెస్ట్‌ చేశారని అనుకుందాం. ‘ఏ’ అనే పథకంలో టీఈఆర్‌ ఒక శాతంగా ఉంది. ‘బీ’ అనే పథకంలో టీఈఆర్‌ 2.5 శాతంగా ఉంది. కానీ, పదేళ్ల తర్వాత రూ.10,000 పెట్టుబడి ‘ఏ’ పథకంలో రూ.36,587గా మారితే, ‘బీ’ పథకంలో రూ.31,407 సమకూరింది. అంటే వ్యత్యాసం ఎంతుందో స్పష్టంగా అర్థమవుతోంది.  

రాబడులు
పేరొందిన ఈక్విటీ ఫండ్స్‌ డైరెక్ట్, రెగ్యులర్‌ ప్లాన్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసే వారి రాబడులు పరిశీలించినా.. డైరెక్ట్‌ ప్లాన్లలోనే ఎక్కువ ఉంటున్నాయి. ఉదాహరణకు మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ (ఎక్స్‌ఐఆర్‌ఆర్‌) డైరెక్ట్‌ ప్లాన్‌లో 16.73 శాతం రాగా, రెగ్యులర్‌ ప్లాన్‌లో ఇది 15.60 శాతంగానే ఉంది. అంటే గడిచిన పదేళ్లలో ఈ పథకంలో చేసిన రూ.6 లక్షల సిప్‌ కాస్తా డైరెక్ట్‌ ప్లాన్‌లో రూ.14.26 లక్షలుగా మారితే, రెగ్యులర్‌ ప్లాన్‌లో రూ.13.42 లక్షలు అయి ఉండేది. అంటే ఈ రెండింటి మధ్య రూ.82,945 వ్యత్యాసం కనిపిస్తోంది. రెగ్యులర్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇన్వెస్టర్‌ పదేళ్ల కాలంలో కమీషన్ల రూపేణా ఇంత మొత్తం నష్టపోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్‌బీఐ బ్లూచిప్‌ ఫండ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్‌ బ్లూచిప్‌ ఫండ్‌లోనూ రెగ్యులర్‌ ప్లాన్‌తో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్లలో రూ.67,540, రూ.60,788 చొప్పున అధిక రాబడి వచ్చింది.

నేపథ్యం..
2007 వరకు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్‌ సంస్థల ద్వారా ఇన్వెస్ట్‌ చేసినా ఈ చార్జ్‌ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్‌ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి)ను సెబీ కోరింది.

అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్‌ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్‌ సంస్థలు కమీషన్‌ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి.

నేరుగా ఫండ్స్‌ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్‌ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్‌ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్‌ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్‌ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్‌ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్‌ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్‌ ప్లాన్లలో టీఈఆర్‌ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది.

ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..?

డైరెక్ట్, రెగ్యులర్‌ ప్లాన్ల మధ్య రాబడుల్లో ఇంత స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నా, ఈ ప్రయోజనాన్ని పొందుతున్న ఇన్వెస్టర్లు 25 శాతానికి మించి లేరు. యాంఫీ గణాంకాల ప్రకారం మొత్తం 13.89 కోట్ల వ్యక్తిగత ఫండ్స్‌ ఫోలియోల్లో డైరెక్టర్‌ ప్లాన్లలో పెట్టుబడులకు సంబంధించినవి కేవలం 3.45 కోట్ల ఫోలియోలే ఉన్నాయి. ఫండ్స్‌ నిర్వహణ ఆస్తుల్లో డైరెక్ట్‌ ప్లాన్ల నుంచి వస్తున్నది 12 శాతం మించి లేదు.

ఇందుకు గల కారణాలపై మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో ఆంటోనీ హెరెడియా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఫండ్స్‌లో రెగ్యులర్‌ ప్లాన్లు సైతం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి సంపదను సమకూర్చి పెట్టాయి. దీనికి తోడు డైరెక్ట్‌ ప్లాన్లపై ఎక్కువ మందిలో అవగాహన లేదు’’అని వివరించారు. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు డైరెక్ట్‌ ప్లాన్ల వైపే మొగ్గు చూపుతుంటే, నాన్‌ ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్లలోనూ 50 శాతం మంది డైరెక్టర్‌ ప్లాన్లనే ఎంచుకుంటున్నారు. కేవలం రిటైల్‌ విభాగంలోనే డైరెక్ట్‌ ప్లాన్లను ఎంపిక చేసుకుంటున్న వారు తక్కువగా ఉంటున్నారు.  

ఏమిటి మార్గం..?
ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల అవగాహన ఉంటే మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్‌ ప్లాన్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సాయం తీసుకోవాలి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు, సంపద సృష్టికి మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఎంపిక కీలకం అవుతుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో వేలాది పథకాలు ఉన్నాయి. ఇందులోనూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, రిస్‌్కకు అనుగుణంగా అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవడం కొంచెం క్లిష్టమైన పనే.

ఈక్విటీ మార్కెట్ల పట్ల అవగాహన కలిగి ఉండి, రోజులో కొంత సమయం కేటాయించే వీలున్న వారు నేరుగా డైరెక్ట్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. లేదంటే సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్ల సేవలను ఆశ్రయించినట్టయితే, వారు మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్‌ ప్లాన్లను సూచిస్తారు. కాకపోతే సెబీ వద్ద నమోదైన ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు కేవలం 1,328 మందే ఉన్నారు. కనుక ఇన్వెస్టర్లు డిస్కౌంట్‌ బ్రోకర్లు, ఫిన్‌టెక్‌ సంస్థల సేవలను సైతం పొందొచ్చు. కాకపోతే చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సూచనల మేరకే నడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

వ్యత్యాసాలు
► మ్యూచువల్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లలో పంపిణీదారులు, బ్రోకర్లు తదితర మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. కనుక రెగ్యులర్‌ ప్లాన్‌లో యూనిట్‌ ఎన్‌ఏవీతో పోలిస్తే, డైరెక్ట్‌ ప్లాన్‌ యూనిట్‌ ఎన్‌ఏవీ ఎక్కువగా ఉంటుంది.  
►డైరెక్ట్‌ ప్లాన్లలో టీఈఆర్‌ తక్కువ. దీంతో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి వీటిల్లో ఎక్కువ.
►డైరెక్ట్‌ ప్లాన్లను ఏ సంస్థా సూచించదు. ఇన్వెస్టర్‌ నేరుగా ఎంపిక చేసుకోవాలి.  
►ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డైరెక్ట్‌ ప్లాన్లలో సులభంగా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. జెరోదా, గ్రోవ్‌ వంటి సంస్థలు సైతం డైరెక్ట్‌ ప్లాన్లను ఆఫర్‌ చేస్తున్నాయి.

Advertisement
Advertisement