‘ఏప్రిల్‌ 1 నుంచి ఆ విమానాలు బంద్‌’

19 Mar, 2019 20:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో సవాల్‌ ముంచుకొచ్చింది. ఈ మాసాంతంలోగా జీతాలు చెల్లించకుంటే విమానాలు పైకి ఎగరవని, తమ సేవలు నిలిపివేస్తామని పైలట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కంపెనీ దేశీయ పైలట్లతో కూడిన నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌లో మంగళవారం విస్తృతంగా చర్చించిన అనంతరం వారు ఈ ప్రకటన చేశారు.

సంస్థను చక్కదిద్దే ప్రణాళికపై స్పష్టత రాకున్నా, వేతన చెల్లింపులపై పరిష్కారం లభించకపోయినా ఏప్రిల్‌ 1 నుంచి తాము విధులకు హాజరుకాబోమని గిల్డ్‌ స్పష్టం చేసింది. వేతనాలపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏవియేటర్స్‌ గిల్డ్‌ గతవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వర్‌కు లేఖ రాసింది.

మరిన్ని వార్తలు