4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌.. జియో టాప్‌

30 Dec, 2017 02:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎప్పటిలాగే 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్‌ నెలలో జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ గరిష్టంగా 21.8 ఎంబీపీఎస్‌ నమోదయ్యింది. ఇక అప్‌లోడ్‌ స్పీడ్‌లో మాత్రం ఐడియా సెల్యులర్‌ 7.1 ఎంబీపీఎస్‌తో టాప్‌లో ఉంది.

ట్రాయ్‌ తాజా గణాంకాల ప్రకారం.. జియో 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ తన సమీప ప్రత్యర్థి వొడాఫోన్‌ డౌన్‌లోన్‌ స్పీడ్‌ (9.9 ఎంబీపీఎస్‌)తో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్‌లో జియో స్పీడ్‌ 21.9 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఇక భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ వరుసగా 9.3 ఎంబీపీఎస్‌గా, 8.1 ఎంబీపీఎస్‌గా ఉంది. 

మరిన్ని వార్తలు