రుణ రేటు తగ్గించిన కోటక్ బ్యాంక్

2 Jul, 2015 01:20 IST|Sakshi
రుణ రేటు తగ్గించిన కోటక్ బ్యాంక్

ముంబై: ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ కనీస రుణ (బేస్) రేటును 0.10 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.85 శాతం నుంచి 9.75 శాతానికి తగ్గింది. జూలై 2వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రైవేటు రంగంలో మూడు అతిపెద్ద బ్యాంకులు- ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌లతో పోల్చితే... ఇప్పటికీ కోటక్ ఆఫర్ చేస్తున్న బేస్ రేటు 5 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది.   కనీస రుణ రేటు తగ్గడం వల్ల దీనితో అనుసంధానమైన వాహన, గృహ, విద్యా రుణ రేట్లు తగ్గే వీలుంటుంది.  ఈ ఏడాది మొత్తంలో ఆర్‌బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25 శాతం) 0.75 శాతం తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనంలో కొంత కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. రుణ రేటు తగ్గడం డిపాజిట్ రేటు తగ్గడానికి కూడా సంకేతం.

మరిన్ని వార్తలు