జూన్ 2 నుంచి సింగపూర్‌లో కమ్యూనిక్ ఏషియా సదస్సు

24 Apr, 2015 01:11 IST|Sakshi
జూన్ 2 నుంచి సింగపూర్‌లో కమ్యూనిక్ ఏషియా సదస్సు

సాక్షి, న్యూఢిల్లీ: సింగపూర్‌లోని మరీనా బే సాండ్స్‌లో జూన్ 2 నుంచి 5వ తేదీ వరకు కమ్యూనిక్ ఆసియా-2015, ఎంటర్‌ప్రైజ్ ఐటీ -2015, కమ్యూనిక్ ఆసియా-2015 సదస్సు నిర్వహించనున్నట్టు కమ్యూనికేషన్స్ ఈవెంట్స్ సహాయ ప్రాజెక్టు డెరైక్టర్ అగ్నెస్ లీయుంగ్ పేర్కొన్నారు. భారత్ నుంచి సుమారు 20కి పైగా కంపెనీలు ప్రదర్శనలో పాల్గొనేందుకు ఎంట్రీలు పంపాయని చెప్పారు. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీయుంగ్ మాట్లాడుతూ కమ్యూనిక్ ఆసియా, ఎంటర్‌ప్రైజ్ ఐటీ 2015 ప్రదర్శన ద్వారా దేశంలోని...

ప్రముఖ ఐసీటీ కంపెనీలు ఒక వేదిక మీదకు రానున్నాయన్నారు. ఈ ఏడాది భారత్ నుంచి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు బ్రాడ్‌బాండ్, క్లౌడ్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) సరికొత్త ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. మొబైల్ డాటా అవసరాల కోసం భారతీయులు 4జీ సేవలపై అమితాసక్తిని కనబరుస్తున్నారన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 4జీ సేవల వినియోగదారుల సంఖ్య 10 మిలియన్ల నుంచి 15 మిలియన్లకు పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్మార్ట్‌సిటీ’, ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాల ద్వారా వైఫై హాట్‌స్పాట్‌ల విస్తరణ పెరిగిందన్నారు.

మరిన్ని వార్తలు