ట్రంప్తో భయమేమీ లేదు: పరిశ్రమలు

10 Nov, 2016 01:35 IST|Sakshi
ట్రంప్తో భయమేమీ లేదు: పరిశ్రమలు

న్యూఢిల్లీ: డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించడంపై దేశీయ పరిశ్రమ అభినందనలు తెలిపింది. అరుుతే అమెరికా మార్కెట్‌లో భారత ఫార్మా ఉత్పత్తుల్ని మరింత అనుసంధానించటం, నైపుణ్య ఉద్యోగుల సాఫీ రవాణాకు వీలు కల్పించటం చేస్తారనే ఆకాంక్ష వ్యక్తం చేసింది. ట్రంప్ విషయంలో నెలకొన్న భయాందోళలన్నీ తప్పని తేలినట్టు పేర్కొంటూ... ఆయన పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ట్రంప్ పాలనలో భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం నూతన శిఖరాలకు చేరుతాయనే నమ్మకాన్ని ఫిక్కీ వ్యక్తం చేసింది.

పరిష్కారమవుతాయని భావిస్తున్నాం..
నైపుణ్య కార్మికుల వలసలు, దేశీయ ఫార్మా ఉత్పత్తులకు అమెరికా మార్కెట్ ప్రవేశం, ఆర్థిక సేవలు, ఎస్‌ఎంఈలకు సంబంధించిన సవాళ్లు పరిష్కారమవుతాయనే ఆశాభావంతో ఉన్నాం. అమెరికాకు సంబంధించి రక్షణ సహకారం, నైపుణ్య కార్మికుల రవాణా వంటివి ప్రధానంగా దృష్టి సారించే అంశాలు. వీటిపై ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ట్రంప్ సర్కారుతో పనిచేసేందుకు చూస్తున్నాం. - నౌషద్ ఫోర్బ్స్, సీఐఐ ప్రెసిడెంట్

 ట్రంప్ పట్ల నమ్మకం ఉంది..
ప్రపంచ దేశాలతో పారదర్శక ఒప్పందాలకు ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ మాటలు నమ్మశక్యంగా ఉన్నారుు. ఫైనాన్షియల్ మార్కెట్లు తొలుత తీవ్ర భయాందోళన చెందినప్పటికీ తర్వాత కోలుకోవడం అమెరికాను మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ట్రంప్ దగ్గర గొప్ప కార్యచరణ ఉందన్న నమ్మకం కలగడం వల్లే. - సునీల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్

 ఇంజినీరింగ్ ఎగుమతులకు జోష్..
మౌలిక సదుపాయాలైన హైవేలు, విమానాశ్రయాలు వంటి వాటిపై పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తానని ట్రంప్ ప్రకటించారు. దాని వల్ల స్టీల్, మెషినరీ, ఉన్నత సాంకేతికత అరుున ఇంజనీరింగ్ ఎగుమతులకు భారీ డిమాండ్ ఉంటుంది.
- టీఎస్ భాసిన్, ఇంజనీరింగ్ ఎగుమతుల మండలి (ఈఈపీసీ) చైర్మన్

 వాణిజ్యం బలోపేతమవుతుంది
గత దశాబ్దకాలంలో ద్వైపాక్షిక, ఆర్థిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల విషయంలో ఇరు దేశాల మధ్య మెరుగుపడ్డ సంబంధాలను ట్రంప్ మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాం. ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం సాకారానికి, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి సరికొత్త అవకాశాల అన్వేషణపై తాజా చర్యలు చేపట్టాల్సి ఉంది.
- రాణా కపూర్, యస్ బ్యాంకు ఎండీ

 మన ఐటీకి ఇబ్బంది ఉండదు
అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితం.. స్వల్పకాలంలో భారత ఐటీ పరిశ్రమ నియామకాలపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన వాగ్దానాలు ఎప్పుడు ఆచరణలోకి వస్తాయో తెలియదు. అత్యుత్తమ డొమైన్ పరిజ్ఞానం, ప్రతిభ, వ్యయ నియంత్రణ అనేవి మన ఐటీ కంపెనీల బలం. వీటిని బట్టి చూస్తే మన ఐటీ పరిశ్రమ అమెరికాకు చాలానే ఇచ్చింది. దీన్ని వారు మరువరు.
- అజయ్ కొల్లా, సీఈఓ- విస్‌డమ్‌జాబ్స్.కామ్

మరిన్ని వార్తలు