ఎల్‌ఐసీ నుంచి జీవన్ ప్రగతి

4 Feb, 2016 02:01 IST|Sakshi
ఎల్‌ఐసీ నుంచి జీవన్ ప్రగతి

హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తాజాగా ‘జీవన్ ప్రగతి’ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది. సంరక్షణ, సేవింగ్స్ ప్లాన్‌తో కూడిన ఈ నాన్-లింక్డ్ పాలసీ కాలంలో ప్రతి ఐదేళ్ల తరువాత దానంతట అదే రిస్క్ కవరేజ్ పెరుగుతుంది. అదే విధంగా అత్యవసర పరిస్థితుల్లో రుణ సౌలభ్యం కూడా ఈ పథకం ద్వారా పొందవచ్చు. బోనస్‌తోపాటు జీవిత బీమా మొత్తం మెచ్యూరిటీ ప్రయోజనంగా అందుతుంది. ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం ప్రయోజన రైడర్ అందుబాటులో ఉంది. 12 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. పాలసీ గడువు 12 నుంచి 20 ఏళ్లు. కనీస జీవిత బీమా మొత్తం రూ.1,50,000. గరిష్ట జీవిత బీమా మొత్తానికి సంబంధించి ఎటువంటి పరిమితి లేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు