మిస్తుబిషీ, టయాటో కార్లకు ఏమైంది?

1 Jul, 2016 12:54 IST|Sakshi

కాన్ బెరా:  ఇంధన మైలేజీ పరీక్షల్లో అక్రమాల కారణంగా   వివాదంలో ఇరుక్కున్న జపాన్  కు చెందిన కార్ల  దిగ్గజ కంపెనీలు మిస్తుబిషీ, టోయాటో లకు మరో  గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో కార్లను వెనక్కి తీసుకుంటున్న  ఈ జెయింట్స్  కు  ఆస్ట్రేలియాలో తీవ్రమైన షాకే తగిలింది.   దేశం అంతటా 8 లక్షల 24 వేల కార్లను   రీకాల్  చేయాల్సిందిగా ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్  కమిషన్ (ఎసీసీసీ)  ఆదేశించింది.    వివిధ లోపాల కారణంగా  జపనీస్  కార్లను పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకోవాల్సిందిగా   నోటీసులు జారీ చేసినట్టు న్యూస్  ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. మిస్తుబిషి, టొయాటో ల పాపులర్  మోడళ్ల కార్ల లో తీవ్రమైన డ్రైవర్ భద్రత లోపాలు, ఎయిర్ బ్యాగ్ , హ్యాండ్  బ్రేక్ లో లోపాలపై  విచారించిన  ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్  కమిషన్ (ఎసీసీసీ)   ఈ భారీ స్థాయిలో కార్ల రీకాల్ కు నోటిసులిచ్చింది. ఈ క్రమంలో భారీ ఎత్తున ఈ కార్లను రీకాల్  చేయనున్నట్టు టొయాటో, మిస్తుబిషి ప్రకటించాయి. ఫ్యూయల్ ట్యాంక్ లో పగుళ్లు వచ్చే అవకాశం ఉందని, ఈ క్రాక్ మరింత విస్తరిస్తే  లీకేజీ సమస్య  ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని టయోటా అంగీకరించింది.  ఫ్యూయల్, ఫ్యూయల్ వేపర్  లో లోపాలుంటే  అగ్ని ప్రమాద తీవ్రత పెరుగుతుంది టయోటా చెప్పింది.

టయోటా ఆస్ట్రేలియా కార్లలో లోపభూయిష్ట హెడ్లైట్లు, ఎయిర్ బ్యాగ్స్ , ఇంధన దోషాలతోపాటు  3లక్షల 24వేల వాహనాలను తిరిగి పిలిపించాలని ఎసీసీసీ ఆదేశించింది.  మిత్సుబిషి మోటర్స్ ఆస్ట్రేలియా దాదాపు 5లక్షల వాహనాలకు రీకాల్ చేయాలని ఆదేశించిందని  జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. శుక్రవారం అందించిన నివేదిక ప్రకారం ఈ రికాల్ లో ట్రిటోన్ యుటే,  లాన్సర్ సెడాన్, ఔట్ లాండర్, సహా మిత్సుబిషి కి చెందిన  అత్యంత ప్రజాదరణ పొందిన కార్లున్నాయి.  అక్టోబర్ 2008, 2015 మధ్య తయారైన ఇరు కంపెనీ కార్లను రీకాల్ చేయనున్నాయి. మరోవైపుఈ రెండు కంపెనీలు చెందిన  ఎనిమిది లక్షలమంది  కార్ల యజమానులకు  ఈ మెయిల్ ద్వారా  సమాచారం అందిస్తామని, అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయనున్నట్టు వెల్లడించాయి.
 

మరిన్ని వార్తలు