నోకియా ఫీచర్ ఫోన్ : సరికొత్తగా నేడే

16 Jun, 2020 11:43 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖమొబైల్ తయారీ దారు నోకియా మరోసారి తన  క్లాసిక్ ఫీచర్ ఫోన్‌తో వినియోగదారును ఆకర్షించనుంది. నోకియా 5310  (2020) ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్  ద్వారా సరికొత్తగా నేడు (మంగళవారం) లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో ఆవిష్కరించనున్న కొత్త నోకియా 5310 ధర  తెలియాలంటే లాంచింగ్  వరకు వెయిట్ చేయాల్సిందే.

ఫీచర్లపై అంచనాలు: కొత్త నోకియా 5310 ఫీచర్ ఫోన్ 2007 వెర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది. 2.4అంగుళాల స్క్రీన్ , డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, ఎఫ్ఎం రేడియో, ఇన్ బిల్ట్ ఎంపీ 3 ప్లేయర్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంబీ  ర్యామ్, 32 జీబీ దాకా ఎక్స్ పాండబుల్ మెమరీ, వీజీఏ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి.

మరిన్ని వార్తలు