అదో టైమ్‌ వేస్ట్‌ కార్యక్రమం

22 Jan, 2019 00:38 IST|Sakshi

 బడ్జెట్‌ వీక్షణపై రాజీవ్‌ బజాజ్‌ కామెంట్‌

న్యూఢిల్లీ: వార్షిక బడ్జెట్‌ రూపకల్పనా ప్రక్రియ ప్రారంభమవుతోందంటే... పారిశ్రామికవేత్తలు వారి కోర్కెలు ప్రభుత్వానికి తెలియజేయడానికి, వాటికి బడ్జెట్‌లో స్థానం కల్పించేలా చూడ్డానికి  శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంటారు. ఇక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా చూడ్డం, ఆయా ప్రతిపాదనలపై వ్యాఖ్యలు చేయడం, తమ అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వంటి అంశాల్లో ఆయా వర్గాల హడావుడి అంతా ఇంతా కాదు.

అయితే దీనిపై బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌  ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి సమర్పించడానికి తన వద్ద ‘విష్‌లిస్ట్‌’ ఏదీ లేదన్నారు. అసలు బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు టీవీల్లో ఈ కార్యక్రమాన్ని చూడ్డమే దండుగ అన్నారు. అదో టైమ్‌ వేస్ట్‌ వ్యవహారమని వ్యాఖ్యానించారు. ‘4 గంటల పాటు బడ్జెట్‌ ప్రసంగం చూసి, బుర్రపై భారం వేసుకునే బదులు, ఆ సమయాన్ని ఏదైనా ఉత్పాదక అంశంపై సద్వినియోగం చేసుకుంటే మంచిది. ద్విచక్ర వాహనాలను లగ్జరీ ఐటమ్‌గా పరిగణించి 28% జీఎస్‌టీ విధించడం తగదు. 18%  పరిధిలో ఉండాలి’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు