రూ.2.23 లక్షల కోట్లకు పి-నోట్ల పెట్టుబడులు

26 Apr, 2016 01:29 IST|Sakshi

 న్యూఢిల్లీ: భారత క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్(పి-నోట్స్) ఇన్వెస్ట్‌మెంట్స్ మార్చినాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరాయి. ఫిబ్రవరిలో ఈ పి-నోట్ల పెట్టుబడులు 18 నెలల కనిష్టానికి పడిపోయాయి. కాగా పి-నోట్ల పెట్టుబడులు పెరగడం 4 నెలల్లో ఇదే తొలిసారి. నవంబర్ నుంచి పి-నోట్ల పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నా యి. విదేశీ హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్, హెడ్జ్ ఫండ్స్, ఇతర విదేశీ సంస్థలు పి. నోట్ల ద్వారా మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల సమయాన్ని, వ్యయాలను ఈ పి-నోట్ల పెట్టుబడులు ఆదా చేస్తాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది  ఫిబ్రవరిలో రూ.2,17,740 కోట్లుగా ఉన్న భారత క్యాపిటల్ మార్కెట్లో (ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్) పి నోట్ల పెట్టుబడులు గత నెలలో రూ.2,23,077 కోట్లకు పెరిగాయి.

మరిన్ని వార్తలు