రూ.7,000 కోట్లు సమీకరించిన పేటీఎమ్‌

26 Nov, 2019 04:52 IST|Sakshi

తాజా నిధులతో పేటీఎమ్‌ విలువ రూ.1,12,000 కోట్లు ! 

రానున్న మూడేళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌ తాజాగా వంద కోట్ల డాలర్లు(రూ.7,000 కోట్లు) సమీకరించింది. అమెరికాకు చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ టీ రోవె ప్రైస్‌తో పాటు పేటీఎమ్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబా, డిస్కవరీ క్యాపిటల్‌ తదితర సంస్థల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు పేటీఎమ్‌ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌(ఓసీఎల్‌) పేర్కొంది.

ఈ తాజా రౌండ్‌లో చైనా ఈ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ నుంచి 40 కోట్ల డాలర్లు వచ్చాయని పేటీఎమ్‌ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. అలాగే సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని  పేర్కొన్నారు. ఈ తాజా పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే పేటీఎమ్‌ కంపెనీ విలువ 1,600 కోట్ల డాలర్ల (రూ.1,12,000 కోట్లు)మేర ఉంటుందని వివరించారు. మూడేళ్లలో ఆర్థిక సేవల విస్తరణ కోసం రూ.10,000 కోట్లు (140 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నామని తెలిపారు.   

2021లో లిస్టింగ్‌ !  
భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల రంగంలో గూగుల్‌ పే, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే, ఇతర సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో పేటీఎమ్‌ ఈ స్థాయిలో పెట్టుబడులు సమీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2012లో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావాలని ఈ కంపెనీ యోచిస్తోంది.  

రూ.3,960 కోట్ల నష్టాలు....
ఏస్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హతావే నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో 30 కోట్ల డాలర్లను పేటీఎమ్‌ సమీకరించింది. పేటీఎమ్‌కు చెందిన మాతృసంస్థ ఏసీఎల్‌కు 2017–18లో రూ.1,490 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,960 కోట్ల మేర నష్టాలు వచ్చాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్‌ ట్రాకర్స్‌ తయారీ కేంద్రం

కొత్త శిఖరాలకు సెన్సెక్స్‌

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చైర్మన్‌ గుడ్‌బై 

సత్తా చాటిన రిలయన్స్ జియో

రికార్డు స్థాయి: 41వేల వైపు చూపు

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10 వేలు తగ్గింపు

కొత్త గరిష్టాల వద్ద స్టాక్‌మార్కెట్లు

బాబోయ్‌ పెట్రోల్‌ ధరలు..

వండర్‌ ట్రక్‌ : 4 రోజుల్లో 1.87 లక్షల ఆర్డర్లు

ప్లేస్‌మెంట్స్‌లో టెకీల హవా..

స్టాక్‌ జోరుకు నో బ్రేక్‌..

40,000–40,800 శ్రేణి కీలకం

నేడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల నిరాహార దీక్ష

మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో

అనిల్‌ అంబానీ రాజీనామా తిరస్కరణ

వాణిజ్య ఒప్పంద పరిణామాలు కీలకం

తక్కువ రిస్క్‌.. చక్కని రాబడి

పసిడి... దీర్ఘకాలంలో పటిష్టమే!

ఒకటా, రెండా.. ఎన్ని డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి?

మీ కార్డును స్విచాఫ్‌ చేయండి

అనిల్‌ అంబానీ రాజీనామా తిరస్కరణ

క్లయింట్ల తరఫున ట్రేడింగ్‌పై నిషేధం లేదు: కార్వీ

నిరుద్యోగ యువతకు ఊరట..

కాగ్నిజెంట్‌ నిర్ణయంతో టెకీలకు షాక్‌..

వన్‌ప్లస్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌

ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో ‘మొబైల్‌’ జోరు...

రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాలి: దాస్‌ 

జీవితకాల గరిష్ట స్థాయికి ఫారెక్స్‌ నిల్వలు 

మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలోకి ముత్తూట్‌ ఫైనాన్స్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టైటిల్‌ కొత్తగా ఉంది

నిర్మాతగా తొలి అడుగు

బాలీవుడ్‌ లేడీస్‌

చైతూ కోసం 1000 మెట్లు మోకాలిపై..

‘జబర్దస్త్‌లోకి రావడానికి అతనే కారణం’

కంగనా నిర్మాతగా ‘అపరాజిత అయోధ్య’