వంట నూనెల ధరలకు రెక్కలు

20 Jul, 2013 16:12 IST|Sakshi

ముంబయి : వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపీమారక విలువ  పడిపోవడంతో ఇంపోర్ట్‌ కాస్ట్‌ పెరిగి వంట నూనెల ధరలు పెరిగాయి.  రిటైల్‌ మార్కెట్లో లీటర్‌కు 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా వంటనూనెల ధరలు పెరిగినట్లు కంపెనీలు ప్రకటించాయి. సన్ ప్లవర్‌ ఆయిల్‌ ధర ఇంతకు ముందు లీటర్‌ 80 రూపాయలు ఉంటే ప్రస్తుతం 95దాకా ధర పలుకుతోంది.

ఇక పాయాయిల్‌కు కూడా  కిలో 47 రూపాయల నుంచి 65 రూపాయలకు పెరిగింది. వేరు శనగ నూనె సైతం 100 రూపాయల నుంచి 110 రూపాయలకు పెరిగింది. భారత్‌లో ఏటా 15 మిలియన్‌ టన్నుల నూనెలు అవసరం అందులో 8 మిలియన్‌ టన్నుల నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని వలన అటు ధరలు పెరగడంతోపాటు భారీ స్ధాయిలో విదేశీ మారక ద్రవ్యం కూడా కోల్పోతున్నాం.

మరిన్ని వార్తలు