చెక్కు బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారం

27 Jul, 2018 00:48 IST|Sakshi

బిల్లుకు పార్లమెంటు ఆమోదం 

న్యూఢిల్లీ: చెక్కు బౌన్స్‌ కేసుల సత్వర విచారణకు వీలుకల్పిస్తున్న బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రమెంట్స్‌ (సవరణ) బిల్లు, 2018కి లోక్‌సభ ఈ నెల 23న ఆమోదముద్రవేయగా, గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీనితో బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర లభించినట్లుయ్యింది.  

తక్షణం ఫిర్యాదుదారుకు 20 శాతం పరిహారం 
తాజా ఎన్‌ఐ యాక్ట్‌ చట్ట  సవరణ (సెక్షన్‌ 143ఏ, సెక్షన్‌ 148) ప్రకారం–  ఫిర్యాదుదారుకు మధ్యంతర పరిహారంగా చెక్కు మొత్తంలో కనీసం 20 శాతం చెల్లించాలని సెక్షన్‌ 138 కింద కేసును విచారిస్తున్న ఒక కోర్టు– చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆదేశాలు జారీ చేయవచ్చు.  విచారణ కోర్టు ఆదేశాలు వెలువరించిన 60 రోజుల లోపు చెక్కు జారీ చేసిన వ్యక్తి ఈ 20 శాతం మొత్తాన్ని ఫిర్యాదుదారుకు చెల్లించాలి. ఒకవేళ దీనిపై చెక్కు జారీ చేసిన వ్యక్తి అప్పీల్‌కు వెళ్లదలిస్తే, అదనంగా మరో 20 శాతాన్ని  మధ్యంతర పరిహారంగా చెల్లించాలి. ఒకవేళ చెక్కు జారీచేసిన వ్యక్తి నిర్దోషిగా కేసు నుంచి బయటపడితే, పరిహారంగా చెల్లించిన మొత్తాన్ని అతనికి తిరిగి ఫిర్యాదుదారు వడ్డీతోసహా చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు.   

మరిన్ని వార్తలు