రుణాలకు ఇకపై ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటు

6 Dec, 2018 00:43 IST|Sakshi

రెపో లేదా ట్రెజరీ ఈల్డ్స్‌ ఆధారిత వడ్డీ రేట్లు

ప్రస్తుతం పీఎల్‌ఆర్, బీపీఎల్‌ఆర్, ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రేట్లు 

వచ్చే ఏప్రిల్‌ నుంచి కొత్త విధానం 

ముంబై: రుణాలపై వడ్డీ రేట్ల పరంగా మరింత పారదర్శకత తీసుకొచ్చే చర్యల్ని ఆర్‌బీఐ ప్రకటించింది. గృహ, ఆటో, పర్సనల్‌ లోన్, ఎంఎస్‌ఈ సంస్థల రుణాలపై ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లను, అది కూడా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లు అయిన రెపో లేదా ట్రెజరీ ఈల్డ్‌తో అనుసంధానించనుంది. ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు అంతర్గత బెంచ్‌ మార్క్‌ రేట్ల విధానాలు ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (పీఎల్‌ఆర్‌), బెంచ్‌ మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (బీపీఎల్‌ఆర్‌), మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ లెండింగ్‌ రేట్‌ (ఎంసీఎల్‌ఆర్‌)ను అనుసరిస్తున్నాయి. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్లతో వడ్డీ రేట్ల అనుసంధానంపై తుది నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.

ఎంసీఎల్‌ఆర్‌ విధానంపై సమీక్ష కోసం ఏర్పాటైన కమిటీ సూచనల మేరకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌తో ముడిపడిన రుణాలను ఇతర రుణాలకూ అమలు చేసే స్వేచ్ఛను బ్యాంకులకు కల్పిస్తున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ‘‘రుణగ్రహీతలు రుణ ఉత్పత్తులను సులువుగా అర్థం చేసుకునేందుకు, పారదర్శ కత కోసం బ్యాంకులు ఒక రుణ విభాగంలో ఒకే తరహా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేటును అనుసరించడం తప్పనిసరి. ఒకే రుణ విభాగంలో ఒకటికి మించిన బెంచ్‌మార్క్‌ రేట్లను అనుసరించేందుకు అనుమతి లేదు’’అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు