రియల్టీపై తీవ్ర ప్రభావం!

12 Dec, 2016 15:08 IST|Sakshi
రియల్టీపై తీవ్ర ప్రభావం!

30 శాతం పడిపోనున్న ఇళ్ల ధరలు..  
రూ. 8 లక్షల కోట్ల విలువ ఆవిరి

 న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అంశం గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. రాబోయే 6-12 నెలల కాలంలో దేశీయంగా 42 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు దాదాపు 30 శాతం మేర పడిపోనున్నారుు. 2008 తర్వాత అమ్ముడైన, అమ్ముడవని రెసిడెన్షియల్ ప్రాపర్టీల మార్కెట్ విలువ సుమారు రూ. 8 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌ఈక్విటీ ఈ మేరకు అధ్యయన నివేదిక విడుదల చేసింది. ’రియల్ ఎస్టేట్ రంగంపై డీమోనిటైజేషన్ దెబ్బతో వచ్చే 6-12 నెలల కాలంలో రూ. 8,02,874 కోట్ల మేర రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోనుంది’ అని పేర్కొంది.

దేశవ్యాప్తంగా 42 నగరాల్లో 22,202 మంది డెవలపర్లకు చెందిన 83,650 ప్రాజెక్టులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ గణాంకాలు, విశ్లేషణను ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన ప్రాప్‌ఈక్విటీ అందిస్తోంది. పీఈ ఆనలిటిక్స్ దీనికి మాతృ సంస్థ. అధ్యయన నివేదిక ప్రకారం 42 టాప్ నగరాల్లో ప్రస్తుతం రూ. 39,55,044 కోట్ల స్థారుులో ఉన్న రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ దాదాపు రూ. 8,02,874 కోట్ల మేర తగ్గి రూ. 31,52,170 కోట్లకు పడిపోనుంది.

ఆయా నగరాల్లో 2008 తర్వాత నుంచి నిర్మాణం పూర్తరుున, నిర్మాణంలో ఉన్న, కొత్తగా నిర్మాణం ప్రారంభమవుతున్న దాదాపు 49,42,637 యూనిట్ల విలువను ప్రాప్‌ఈక్విటీ లెక్కగట్టింది. లెక్కల్లో చూపని ఆదాయాలను హడావుడిగా రియల్ ఎస్టేట్‌లోకి మళ్లించేందుకు చాలా మంది ప్రయత్నిస్తుండటంతో గడచిన 15 రోజుల్లో ఈ రంగంలో అసాధారణ స్థారుులో లావాదేవీలు జరిగాయని తెలిపింది.

ముంబైలో అత్యధికంగా క్షీణత..
అన్ని నగరాలకన్నా అత్యధికంగా ముంబైలో ప్రాపర్టీల విలువ పతనం కానుంది. ముంబైలో మొత్తం మార్కెట్ వేల్యుయేషన్ గరిష్టంగా రూ. 2,00,330 కోట్లుగా ఉండనుంది. సుమారు రూ. 99,983 కోట్లతో బెంగళూరు, రూ. 79,059 కోట్ల క్షీణతతో గుర్గావ్ తర్వాత స్థానాల్లో ఉండనున్నారుు. ’భారత రియల్టీ మార్కెట్ ముందు ప్రస్తుతం సబ్-ప్రైమ్ స్థారుు సంక్షోభం ఉంది. ఇది అసంఘటిత రియల్ ఎస్టేట్, బ్లాక్ మనీ మొదలైన వాటి మూలాలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ప్రాప్‌ఈక్విటీ వివరించింది. రాబోయే రోజుల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల (రీసేల్స్) పరిమాణం కూడా గణనీయంగా తగ్గొచ్చని సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ జసూజా పేర్కొన్నారు.

లావాదేవీ మొత్తాన్ని పూర్తిగా చెక్ రూపంలో ఇచ్చేందుకు ప్రతి అరుుదుగురు కొనుగోలుదారుల్లో ఒక్కరు మాత్రమే సిద్ధంగా ఉంటారని ఆయన చెప్పారు. సాధారణంగా కనీసం 20 నుంచి 30 శాతం దాకా నగదు రూపంలో చాలా మంది నిర్వహించాలనుకుంటారని, కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం పాటు ఈ ధోరణి కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. ’ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకుని సర్దుకునేందుకు రియల్ ఎస్టేట్ రంగానికి కొంత సమయం పడుతుంది కనుక రాబోయే వారాల్లో రీసేల్స్ దాదాపు నిల్చిపోవచ్చు’ అని జసూజా అభిప్రాయపడ్డారు.

రియల్టీ పెట్టుబడులకు బెంగళూరు, ముంబై టాప్: పీడబ్ల్యూసీ
వచ్చే ఏడాది ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో రియల్టీ పెట్టుబడులకు సంబంధించి బెంగళూరు, ముంబై టాప్ నగరాలుగా నిల్చారుు. పీడబ్ల్యూసీ-అర్బన్ ల్యాండ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం ఫిలిప్పీన్‌‌స రాజధాని మనీలా మూడో స్థానం దక్కించుకుంది. అటు వియత్నాంలోని హో చి మిన్ సిటీ, చైనాలోని షెంజెన్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారుు. మెరుగైన రాబడులనిచ్చే అధిక విలువ ప్రాపర్టీల అందుబాటు, కిరారుుకి డిమాండ్ పెరగడం, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతుండటం వంటివి భారత్ రియల్టీ మార్కెట్‌కు ఊతమివ్వగలవని నివేదిక వివరించింది.

>
మరిన్ని వార్తలు