రియల్‌మి యూ1 త్వరలో..

23 Nov, 2018 20:07 IST|Sakshi

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది.  సెల్ఫీ లవర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను తయారుచేశామని కంపెనీ చెబుతోంది. కేవలం నాలుగు స్మార్ట్‌ఫోన్లతోనే తన సత్తా చాటుకున్న రియల్‌మి నవంబర్‌ 28న ‘యూ1’ అనే కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు రియల్‌ ట్విటర్‌ ద్వారా స​మాచారం అందించింది.

హీలియో పీ70 ప్రాసెసర్‌తో వస్తోన్న ప్రపంచంలో తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని కంపెనీ వెల్లడించింది. వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే ప్రధాన పీచర్‌గా పేర్కొన్న కంపెనీ ఇతర ఫీచర్లను మాత్రం రహస్యంగానే ఉంచింది. అయితే 24, 16 మెగాపిక్సల్ డ్యుయల్‌ రియర్‌కెమెరా, 24ఎంపీ సెల్పీ కెమెరా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రియల్‌మి యూ1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకంగా అమెజాన్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. హానర్‌ 8ఎక్స్‌, షావోమి రెడ్‌మి నోట్‌ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీనివ్వొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు  ఈ ఏడాది చివరి నాటికి  ఇయర్‌ ఫోన్స్‌ తదితర  మొబైల్‌ యాక్ససరీస్‌ను  ఇండియన్‌ మార్కెట్లోకి తీసుకు రానున్నామని రియల్‌మి సీఈఓ మాధవ్‌ సేత్‌ వెల్లడించారు. ఆస్క్‌ మాధవ్‌  పేరుతో  రియల్‌మి అధికారిక యూట్యూబ్ ఛానలో నిర్వహించిన వీడియో ఛాట్‌లో ఆయన సమాధానాలిచ్చారు.

మరిన్ని వార్తలు