షావోమి రెడ్మి సిరీస్ సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్మి వై సిరీస్‌లో భాగంగా వై 2 తరువాత రెడ్మి వై3 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్మి 7 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. 32 ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ సెంట్రిక్ డివైస్‌గా రెడ్మి వై 3ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.
ధరలు:
3జీబీ ర్యామ్ , 32 జీబీ స్టోరేజ్ = రూ. 9999
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ = రూ. 11,999
30, ఏప్రిల్ నుంచి అమెజాన్, ఎంఐ, ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా లభ్యం. రెడ్ మి వై 3 కొనుగోలుదారులకు ఎయిర్టెల్ ద్వారా 1000 జీబీ 4జీ డేటా ఉచితం, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.
రెడ్మి వై 3 ఫీచర్లు
6.26 డాట్‌నాచ్ డిస్ప్లే
స్నాప్‌డ్రాగన్ కాల్కామ్ 632 సాక్
ఆండ్రాయిడ్ పై 9
1440x720 పిక్సెల్స్ స్ర్కీన్ రిజల్యూషన్
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
32 ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరా
12+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ