రిలయన్స్ క్యాపిటల్ నికరలాభం రూ.315 కోట్లు

8 Feb, 2018 20:11 IST|Sakshi
రిలయన్స్‌ క్యాపిటల్‌ అధినేత అనిల్‌ అంబానీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై: రిలయన్స్ క్యాపిటల్  లిమిటెడ్  క్యూ3లో  లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 50శాతం వృద్దిని సాధించింది. డిసెంబర్ 31 తో ముగిసిన ఈ త్రైమాసికంలో రిలయన్స్ క్యాపిటల్ రూ. 315 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.  కంపెనీ మొత్తం ఆదాయం రూ .4,771 కోట్లకుగా నమోమైందని కంపెనీ గురువారం వెల్లడించింది.  అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 3,964 కోట్ల రూపాయల ఆదాయాన్ని  రిలయన్స్‌కంపెనీ నికర విలువ రూ .16,232 కోట్లగాను, రుణ ఈక్విటీ నిష్పత్తి 2.48 గా ఉంది. రిలయన్స్ గ్రూప్ కంపెనీ  నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ రూ .470 కోట్లు ఆర్జించగా , 130 కోట్ల రూపాయల నికరలాభాన్ని ఆర్జించింది. సంవత్సరం ప్రాతిపదికన చూస్తే 26 శాతం వృద్ధి సాధించింది. 

భీమా పరిధిలో లైఫ్‌, నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు అధిక ప్రీమియం ఆదాయాన్ని పోస్ట్ చేశాయి. డిసెంబరు 31 న ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ స్థూల రాబడి వార్షిక ప్రాతిపదికన 26 శాతం వృద్ధిరేటుతో రూ. 1,075 కోట్లుగా ఉంది. నిరక లాభం54 శాతం వృద్ధితో  28 కోట్ల  రూపాయలను సాధించింది. అలాగే సంస్థకు చెందిన  బ్రోకింగ్‌  సంస్థ రిలయన్స్ సెక్యూరిటీస్ 83 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది.  వార్షిక ప్రాతిపదికన 2 శాతం గ్రోత్‌తో 14 కోట్ల లాభాన్నినమోదు చేసింది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు