రిలయన్స్‌ డిజిటల్‌ భారీ ఆఫర్లు

9 Aug, 2019 20:37 IST|Sakshi

ఇండిపెండెన్స్ డే : రిలయన్స్‌ డిజిటల్ ఇండియా సేల్

ఆగస్టు 10-15 వరకు సేల్‌

సాక్షి,  హైదరాబాద్ : రిలయన్స్ డిజిటల్ తన బ్లాక్ బస్టర్ డిజిటల్ ఇండియా సేల్‌కు మరోసారి  తెర తీసింది.  ప్రతీ ఏడాది లాగానే  ఈ ఏడాది కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెస్ట్ టెక్నాలజీ డీల్స్, ఆఫర్లతో  'డిజిటల్ ఇండియా సేల్' ని ప్రకటించింది. తద్వారా వినియోగదారులకు అతిపెద్ద ఆఫర్లను  అందిస్తోంది. ఈ బ్లాక్ బస్టర్  డీల్స్‌ ఆగష్టు 10 నుండి ఆగస్టు 15, 2019 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

ఎలక్ట్రానిక్ వస్తువులపై 15శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వడంతో పాటు 5 శాతం రిలయన్స్ డిజిటల్ క్యాష్ బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ 360 రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 2200 మై జియో స్టోర్స్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ‘రిలయన్స్ డిజిటల్’ ఆన్ లైన్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జీరో డౌన్ పేమెంట్, ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది.

ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్ టాపులు భారీ ఆఫర్లను అందిస్తోంది.  ముఖ్యంగా 55 అంగుళాల టీవీ రూ.39,999కు,  65 అంగుళాల టీవీ రూ.59,990కు, 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.10,999కే లభించనుంది.  దీంతోపాటు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.44,990కే లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. రూ.16,990కే అందుబాటులో ఉండనుంది. మెజో జీ6 ప్లస్(6జీబీ) స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9.999కే లభించనుంది. అలాగే న్యూ ఒప్పోఆర్17(8జీబీ) రూ.19,999కే అందనుంది. వీటితో పాటు బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా అందిస్తోంది.

మరిన్ని వార్తలు