మళ్లీ జియోనే టాప్‌

16 Mar, 2019 18:04 IST|Sakshi

ఫిబ్రవరిలో రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్  మళ్లీ టాప్‌

2, 3 స్థానాల్లో ఎయిర్‌టెల్‌,  వొడాఫోన్‌

పుంజుకున్న ఐడియా 

అప్‌లోడ్‌లో వోడాఫోన్  టాప్‌

సాక్షి, ముంబై : రిలయన్స్‌ జియో  డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో తన ఆధిక్యాన్ని మరోసారి నిరూపించుకుంది. జనవరి మాసంతో పోలిస్తే మరింత పుంజుకుని ఫిబ్రవరిలో 20.9 ఎంబీపీఎస్‌గా నమోదైంది. మరో టెలికం కంపెనీ భారతి ఎయిర్‌టెల్‌ 9.4 ఎంబీపీఎస్‌ రెండవస్థానంలో నిలిచింది. 6.8 ఎంబీపీఎస్‌తో వోడాఫోన్‌ మూడవ స్థానాన్ని సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ గణాంకాలను విడుదల చేసింది.

ఫిబ్రవరిలో సగటున సెకన్ కి 20.9 మెగాబిట్ స్పీడ్ తో రిలయన్స్ జియో అన్నిటి కంటే వేగమైన 4జి నెట్ వర్క్ గా నిలిచింది.  జనవరిలో  పోలిస్తే భారతీ ఎయిర్టెల్  స్పీడ్‌ 9.5 వద్ద, వొడాఫోన్ స్పీడ్ 6.7ఎంబీపీఎస్‌ గా నమోదయ్యాయి. 

మరోవైపు ఐడియా డౌన్ లోడ్ స్పీడ్ స్వల్పంగా పుంజుకుంది. ఫిబ్రవరిలో ఐడియా నెట్ వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడ్  5.7 ఎంబీపీఎస్‌గా ఉంది.  జనవరిలో ఇది 5.5 ఎంబీపీఎస్ గా ఉంది. అయితే వోడాఫోన్, ఐడియా సెల్యులార్  కంపెనీలు మెగా మెర్జర్‌ అనంతరం వోడాఫోన్‌ ఐడియాగా అవతరించిన సంగతి తెలిసిందే.  కానీ ట్రాయ్ ఈ రెండు నెట్ వర్క్ ల ప్రదర్శన గణాంకాలను వేర్వేరుగా విడుదల చేసింది.

సగటు అప్లోడ్ స్పీడ్ విషయంలో వోడాఫోన్ మిగతా నెట్ వర్క్ల కంటే ముందుంది. ఫిబ్రవరిలో వోడాఫోన్ అప్ లోడ్ స్పీడ్ 6ఎంబీపీఎస్ గా ఉంది. గత నెలలో ఇది 5.4 ఎంబీపీఎస్ మాత్రమే ఐడియా, ఎయిర్టెల్ సగటు 4జి అప్ లోడ్ స్పీడ్ లు తగ్గి వరుసగా 5.6 ఎంబీపీఎస్, 3.7 ఎంబీపీఎస్ గా ఉన్నాయి. జియో సగటు అప్ లోడ్ స్పీడ్ కొంత మెరుగై 4.5ఎంబీపీఎస్ కి చేరింది.

మరిన్ని వార్తలు