చిన్న సంస్థల రుణాలపై ఆర్‌బీఐ మార్గదర్శకాలు

2 Jan, 2019 01:41 IST|Sakshi

న్యూఢిల్లీ: డిఫాల్ట్‌ అయిన చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం డిఫాల్ట్‌ అయినప్పటికీ జనవరి 1 నాటికి ’స్టాండర్డ్‌’ స్థాయిలోనే ఉన్న  రుణాలను వన్‌ టైమ్‌ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించింది. వివిధ రూపాల్లో తీసుకున్న రుణపరిమాణం రూ. 25 కోట్లు దాటని సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2020 మార్చి 31 నాటికి పునర్‌వ్యవస్థీకరణ అమలు చేయాల్సి ఉంటుంది.    

మరిన్ని వార్తలు