ఇండియా పోస్ట్‌తో అమెజాన్‌ జట్టు: వారి కోసమే

1 Sep, 2023 11:33 IST|Sakshi

ఎస్‌ఎంఈ ఎగుమతిదారులకు తోడ్పాటు

న్యూఢిల్లీ: చిన్న సంస్థలకు (ఎస్‌ఎంఈ) ఎగుమతులను సులభతరం చేసే దిశగా ఇండియా పోస్ట్‌తో అమెజాన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. సంభవ్‌ సమ్మిట్‌ 2023 సందర్భంగా కంపెనీ ఈ విషయం తెలిపింది.

 ఇదీ చదవండి: పాక్‌ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు

అలాగే అమెజాన్, ఇండియా పోస్ట్‌ మధ్య దశాబ్ద కాలపు భాగస్వామ్యానికి గుర్తుగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ స్మారక స్టాంపును ఆవిష్కరించినట్లు వివరించింది. తమ విక్రేతలకు  తోడ్పాటు అందించేందుకు సహ్‌–ఏఐ పేరిట కృత్రిమ మేథ ఆధారిత డిజిటల్‌ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టినట్లు అమెజాన్‌ తెలిపింది.  (సిమ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం)

మరిన్ని వార్తలు