ఫ్లిప్‌కార్ట్‌తో సాఫ్ట్‌బ్యాంకు చర్చలు

8 Aug, 2017 01:04 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌తో సాఫ్ట్‌బ్యాంకు చర్చలు

2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ సాఫ్ట్‌బ్యాంకు ఫ్లిప్‌కార్ట్‌తో అనుబంధానికి ప్రయత్నిస్తోంది. స్నాప్‌డీల్‌లో అతిపెద్ద వాటాదారైన సాఫ్ట్‌బ్యాంకు (35% వాటా) దాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేయడం ద్వారా దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థలో వాటా పొందాలని చూసింది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం విషయమై చర్చల నుంచి స్నాప్‌డీల్‌ వైదొలగడంతో, సాఫ్ట్‌ బ్యాంకు నేరుగా ఫ్లిప్‌కార్టులో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని సాఫ్ట్‌బ్యాంకు చైర్మన్‌ మసయోషిసన్‌ తాజాగా వెల్ల డించారు. సాఫ్ట్‌ బ్యాంకు జూన్‌ క్వార్టర్‌ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకు విజన్‌ ఫండ్‌ ద్వారా 2 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.

>
మరిన్ని వార్తలు