ఈ రెస్టారెంట్‌లో చెంపదెబ్బలు వడ్డిస్తారు!

10 Dec, 2023 04:24 IST|Sakshi

వైరల్‌

అనగనగా జపాన్‌లో ‘షచిభొకయ–యా’ అనే రెస్టారెంట్‌ ఉంది. నాగోయ నగరంలో ఉన్న ఈ రెస్టారెంట్‌కు రుచుల కోసం కాదు చెంపదెబ్బల కోసం కస్టమర్‌లు క్యూ కట్టేవారు. రెస్టారెంట్‌లోకి అడుగు పెట్టగానే కస్టమర్‌ చెంప చెళ్లుమనిపిస్తుంది వెయిటర్‌. ఈ రెస్టారెంట్‌లో ఒక లేడి వెయిటర్‌ కస్టమర్‌ చెంప చెళ్లుమనిపిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

‘ఇదెక్కడి చోద్యమమ్మా ’ అని ప్రపంచం బిత్తరపోతుండగానే రెస్టారెంట్‌ వాళ్లు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటన చేశారు. ‘మా రెస్టారెంట్‌లో ప్రస్తుతం చెంపదెబ్బలు లేవు. రెస్టారెంట్‌కు రావడానికి ముందు ఈ విషయాన్ని గమనించాలని మనవి’ అనేది ఆ ప్రకటన సారాంశం.

పబ్లిసిటీ కోసం చెంపదెబ్బల సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారా? లేక దీని వెనుక ‘ఈ రెస్టారెంట్‌లో చెంపదెబ్బ తింటే కలిసి వస్తుంది’ అనే సెంటిమెంట్‌ దాగుందా అనేది  తెలియదుగానీ రుచులతో సంబంధం లేకుండానే ఈ రెస్టారెంట్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం అయింది.

>
మరిన్ని వార్తలు