Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు

10 Dec, 2023 19:04 IST|Sakshi

టోక్యో: ఉత్తర జపాన్‌ బీచ్‌లో వేలాది చేపలు మృతి చెందాయి. జపాన్ ఉత్తర ద్వీపం హక్కైడోలోని హకోడేట్‌లో వేలాది చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సముద్ర కెరటాలను కమ్మేసిన మృతి చెందిన చేపలు చూసిన అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ చేపలను తినకూడదని స్థానికులకు తెలిపారు.

చేపల మరణానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ ఫుకుషిమా అణు కర్మాగారం నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలతో కూడిన నీటిని విడుదల చేయడమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. 

ఈ ఏడాది అక్టోబర్‌లో జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం నుండి మురుగునీటిని విడుదల చేసింది. ఈ చర్యను చైనా ఖండించింది. 2011 నుండి సేకరించబడిన 1.34 మిలియన్ టన్నుల మురుగునీటిలో కొంత భాగాన్ని పసిఫిక్‌లోకి జపాన్  మొదటిసారి ఆగష్టు 24న విడుదల చేసింది. మార్చి 2011లో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా పవర్ ప్లాంట్ ధ్వంసమైన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి


 

>
మరిన్ని వార్తలు