ఆర్‌బీఐ ఎఫెక్ట్‌: రుపీ వీక్‌

31 Oct, 2018 09:10 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు  బహిర్గతమైన నేపథ్యంలో దేశీయ కరెన్సీ నష్టాలతో ప్రారంభమైంది. మంగళవారం నాటి 73.67 రాటి  ముగింపుతో పోలిస్తే  నేడు మరింత దిగజారింది. డాలరు మారకంలో రూపాయి 73.92 వద్ద ప్రారంభమైంది. 35పైసలు క్షీణించి మళ్లీ 74.03 వద్ద  కొనసాగుతోంది. దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రించే అధికారిక సంస్థ రిజర్వ్ బ్యాంక్‌(ఆర్‌బీఐ)కు తగిన స్వేచ్చలేదంటూ సాక్షాత్తూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అసంతృప్తి,   దీనికి  ప్రతిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌  జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు  ప్రతికూల సంకేతాలందించినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. 

>
మరిన్ని వార్తలు