ఆగని రూపాయి పతనం

10 Sep, 2018 10:44 IST|Sakshi

సాక్షి,ముంబై: రూపాయి మారకంలో పతనం మరింతగా కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం మరింతగా బలహీనపడుతోంది. ట్రేడ్ వార్ వంటి పరిణామాలతో పాటు, పలు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా రూపాయి మరింతగా క్షీణించింది. గత ముగింపుతో 71.75 పోల్చితే ట్రేడింగ్ ఆరంభంలోనే డాలరుతో రూ. 72.18కు పడిపోయిన రూపాయి  ఆ ఆ తరువాత మరింత దిగజారింది. 64 పైసల నష్టంతో 72.37 స్థాయిని టచ్‌ చేసింది.

గత వారం అంతా క్షీణిస్తూనే ఉన్న రూపాయి విలువ.. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కొంత కోలుకున్నట్లుగా కనిపించింది. అయితే, సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలో ఏమాత్రం కోలుకునే ధోరణి కనిపించలేదు. సరికదా మరో కొత్త కనిష్ట స్థాయికి క్షీణించింది. మరోవైపు రూపాయి విలువ 73-74 మధ్య స్థిరపడవచ్చని కరెన్సీ ఎక్స్‌పర్ట్స్ అంచనా. మరోవైపు దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 233 పాయింట్లుకు పతనంగా కాగా నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించింది.

>
మరిన్ని వార్తలు