ఆఫర్‌ పట్టు.. జెర్సీ కొట్టు

18 Apr, 2018 16:38 IST|Sakshi

సాక్షి, ముంబై : స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్‌ ఐపీఎల్‌-11 సీజన్‌ సందర్భంగా శాంసంగ్‌ 20 - 20 కార్నివల్‌ను ప్రకటించింది. ఈ కార్నివల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక ధరలను, ఎక్స్చేంజ్‌ ఆఫర్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ఈ కార్నివల్‌ను శాంసంగ్‌ ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో నిర్వహిస్తోంది. శాంసంగ్‌ కార్నివల్‌ నేటి(ఏప్రిల్‌ 18) నుంచి ఏప్రిల్‌ 21 వరకు జరగనుంది. కేవలం డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు మాత్రమే కాక ప్రతిరోజు 20 మంది లక్కీ విన్నర్స్‌కి శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ముంబై ఇండియన్స్‌ జెర్సీని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

శాంసంగ్‌ 20 - 20 కార్నివల్‌లో అందిస్తున్న డిస్కౌంట్లు ఈ విధంగా ఉన్నాయి..
గెలాక్సీ ఏ8 ప్లస్‌ రూ.29,990కు అందుబాటులో ఉంది. 2వేల రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించిన తర్వాత గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ 32 జీబీ వేరియంట్‌ రూ.10,990కే విక్రయానికి లభ్యమవుతోంది. అలానే గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ 64జీబీ వేరియంట్‌పై కూడా 2వేల రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.12,990కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌  చేసుకుని గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ కొనేవారికి అదనంగా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ లభించనుంది. వీటితో పాటు శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7 ప్రో, ఆన్‌5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు కూడా ప్రత్యేక ధరలు రూ.6,990కు, రూ. 6,490కు లభిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కి ప్రధాన స్పాన్సర్‌ అయిన శాంసంగ్‌ ఈ ఐపీఎల్‌ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ప్రియులకు ఆనందాన్ని పంచడానికి అమెజాన్‌లో ఈ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ సందీప్‌ సింగ్‌ అరోరా తెలిపారు.

అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ నూర్‌ పటేల్‌ మాట్లాడుతూ... అమెజాన్‌లో నిర్వహిస్తున్న శాంసంగ్‌ కార్నివల్‌ దేశవ్యాప్తంగా ఉన్న అమెజాన్‌ వినియోగదారులకు పునరుత్తేజాన్ని కలిగించనుందని తెలిపారు. ఈ క్రికెట్‌ సీజన్‌లో వినియోగదారులు కేవలం శాంసంగ్‌ స్మార్టఫోన్లపై ఆఫర్లను, డిస్కౌంట్లను మాత్రమే కాక వారి అభిమాన ముంబై ఇండియన్స్‌ జట్టు అధికారిక జెర్సీని కూడా పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్నివల్లో కొనుగోలుదారులకు డిస్కౌంట్‌ ఆఫర్లు మాత్రమే కాక మరిన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన ఫోన్లపై ఎంపిక చేసిన క్రెడిట్‌ / డెబిట్‌ కార్డులపై నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ ఆఫర్‌ను కూడా శాంసంగ్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు