లోన్‌ కావాలా? అయితే మీకో శుభవార్త

21 Aug, 2017 19:24 IST|Sakshi
లోన్‌ కావాలా? అయితే మీకో శుభవార్త

ముంబై: ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు మరో వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది.   రిటైల్ కస్టమర్లకు వివిధ రుణాలపై పండుగ ఆఫర్‌ణు సోమవారంప్రకటించింది. వినియోగదారులకు అందించే వివిధ లోన్లపై ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేసింది.  ఇటీవల  పొదుపు ఖాతాలవడ్డీ రేట్లు తగ్గించిన  బ్యాంకు తాజాగా వివిధ రుణాలపై 100శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజు ను రద్దు చేస్తున్నట్టు   వెల్లడించింది.   రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో  ఉంచుకొన్న బ్యాంకు కారు,  వ్యక్తిగత,  బంగారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

ఆఫర్ వివరాలు
1. డిసెంబరు 31, 2017 వరకు కారు రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు
2. అక్టోబర్ 31, 2017 వరకు వ్యక్తిగత బంగారు రుణాలపై పై 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు
3. సెప్టెంబరు 30, 2017 వరకు వినియోగదారులకు ఎక్స్ ప్రెస్ క్రెడిట్‌పై ( వ్యక్తిగత రుణం) ప్రాసెసింగ్ ఫీజు 50శాతం మినహాయింపు పొందవచ్చు

కాగా  ఇప్పటివరకు బ్యాంక్‌ రుణంమొత్తంపై  0.5శాతం, కారు లోన్లపై 2శాతం,  ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ ప్రాసెసింగ్ ఫీజుగా 0.5శాతం  ద్విచక్ర వాహనాల లోన్లపై సూపర్‌ బైక్‌ పై 1.5శాతం, గోల్డ్‌ లోన్లపై 0.51శాతం ఛార్జ్‌ చేస్తోంది. దీనికి  అదనంగా జీఎస్‌టీ ని కూడా వసూలు చేస్తోంది.

మరిన్ని వార్తలు