-
అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు..
US Waives In-Person Interview: భారతీయ అమెరికా వీసా దరఖాస్తుదారులకు ఇది మంచి తీపి కబురు. విద్యార్థులు, కార్మికులతో సహా చాలా మంది అమెరికా వీసా దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు అమెరికా తెలిపింది. ఈ ఏడాది 31 వరకు విద్యార్థుల, కార్మికులు, సంస్కృతిక కళాకారులకు సంబంధించిన వివిధ రకాల వీసాల వ్యక్తిగత ఇంటర్వ్వూలను రద్దు చేస్తున్నట్లు అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త ఒకరు భారతీయ కమ్యూనిటీ నాయకులకు తెలిపారు. దీనికి విద్యార్థుల(F, M, J), ఉద్యోగులు(H-1, H-2, H-3, L), సంస్కృతిక కళాకారులు , విశిష్ట ప్రతిభావంతులు(O, P, Q )లకు సంబంధించిన దరఖాస్తుదారులు ఈ వీసా వ్యక్తిగత ఇంటర్య్యూల రద్దుకు అర్హులు. అయితే ఈ విధానం వీసా దరఖాస్తుదారులకు, వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉండటమే కాక చాలా అవరోధాలను, అడ్డంకులను తొలగిస్తుందని దక్షిణాసియా కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా అన్నారు. భూటోరియా ఆసియా అమెరికన్లకు సంబంధించిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహదారుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆయన దక్షిణ మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్ లూతో జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. డోనాల్ లూ డిసెంబర్ 31 వరకు ఈ ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారని భూటోరియా చెప్పారు. అయితే ఈ వ్యక్తిగత ఇంటర్వ్యూల రద్దు విధానం వర్తించాలంటే గతంలో అమెరికాకు సంబంధించిన ఏదైన వీసా పొంది ఉండాలి. కానీ వీసా తిరస్కరణకు గురైనవారు, తగిన అర్హత లేనివారికి ఇది వర్తించదు. అయితే ప్రస్తుతం న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం వెబ్సైట్లో చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలోని కాన్సులేట్లు ఈ కొత్త ఏడాదికి 20 వేలకు పైన మినహాయింపు (డ్రాప్‌బాక్స్) వీసా దఖాస్తులను ఆహ్వానించింది. (చదవండి: ఉక్రెయిన్‌కి రూ.65 కోట్ల విరాళం ఇచ్చిన జపాన్ బిలియనీర్!) -
లోన్ కావాలా? అయితే మీకో శుభవార్త
ముంబై: ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరో వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. రిటైల్ కస్టమర్లకు వివిధ రుణాలపై పండుగ ఆఫర్ణు సోమవారంప్రకటించింది. వినియోగదారులకు అందించే వివిధ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఇటీవల పొదుపు ఖాతాలవడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు తాజాగా వివిధ రుణాలపై 100శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజు ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొన్న బ్యాంకు కారు, వ్యక్తిగత, బంగారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్ వివరాలు 1. డిసెంబరు 31, 2017 వరకు కారు రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు 2. అక్టోబర్ 31, 2017 వరకు వ్యక్తిగత బంగారు రుణాలపై పై 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు 3. సెప్టెంబరు 30, 2017 వరకు వినియోగదారులకు ఎక్స్ ప్రెస్ క్రెడిట్‌పై ( వ్యక్తిగత రుణం) ప్రాసెసింగ్ ఫీజు 50శాతం మినహాయింపు పొందవచ్చు కాగా ఇప్పటివరకు బ్యాంక్ రుణంమొత్తంపై 0.5శాతం, కారు లోన్లపై 2శాతం, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప్రాసెసింగ్ ఫీజుగా 0.5శాతం ద్విచక్ర వాహనాల లోన్లపై సూపర్ బైక్ పై 1.5శాతం, గోల్డ్ లోన్లపై 0.51శాతం ఛార్జ్ చేస్తోంది. దీనికి అదనంగా జీఎస్టీ ని కూడా వసూలు చేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్‌పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement