లాభాల్లో ముగిసిన ‍స్టాక్‌ మార్కెట్లు

23 Oct, 2017 15:56 IST|Sakshi

ముంబై : మిడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు పుంజుకోవడంతో పాటు, బ్యాంకు, రియల్టీ, ఐటీ షేర్ల అండతో మార్కెట్లు లాభాల్లోకి ఎగిశాయి. సెన్సెక్స్‌ 116.76 పాయింట్లు ఎగసి 32,506 వద్ద , నిఫ్టీ 38 పాయింట్లు జంప్‌ చేసి 10,184 వద్ద క్లోజైంది. రియల్టీ, బ్యాంకు షేర్లు నేటి ట్రేడింగ్‌లో మంచి లాభాలను ఆర్జించాయి. 5 శాతం మేర లాభంలో ఎయిర్‌టెల్‌ టాప్‌ గెయినర్‌గా నిలువగా.. హీరో మోటోకార్పొ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  4-1.5 శాతం మేర లాభాలు పండించాయి.  

మరోవైపు సిప్లా, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, లుపిన్‌, బాష్‌, ఐబీ హౌసింగ్‌, ఐషర్‌,హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌ 3-1.2 శాతం మధ్య నష్టాలు గడించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసల లాభంలో 65.03గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 104 రూపాయల నష్టంలో రూ.29,450గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు