నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

4 Feb, 2019 11:09 IST|Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లు  బలహీనంగా ప్రారంభమయ్యాయి.  అంతర్జాతీయ  మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, అమ్మకాలు ఒత్తిడితో మరింత బలహీనపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 149 పాయింట్ల నష్టంతో 36,320 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ  నష్టపోతోంది. 10,830 దిగువకు చేరింది.  

బ్యాంక్స్‌, మెటల్‌, మీడియా, ఆటో, రియల్టీ శాతం నష్టపోతుండగా, ఐటీ పాజిటివ్‌గా ఉంది. ఐబీ హౌసింగ్‌, జీ, హెచ్‌పీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హీరో మోటో, హిందాల్కో, ఐసీఐసీఐ  టాప్‌ లూజర్స్‌గాఉన్నాయి.  అలాగే  ఇన్‌సాల్వెన్సీ ప్రకటనతో ఆర్‌ కాం భారీగా నష్టపోతోంది. మరోవైపు  టైటన్‌ 4 శాతం జంప్‌చేయగా.. ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఆర్‌ఐఎల్‌, విప్రో,  హెచ్‌సీఎల్‌ టెక్‌  లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు