నష్టాల్లో మార్కెట్లు : బ్యాంకులు బేర్‌

22 Apr, 2019 09:59 IST|Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే అమ్మకాలు ఊపందుకోవడంతో  మరింత పతనమయ్యాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 291 పాయింట్లు క్షీణించి 38,840 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 11,665 వద్ద ట్రేడవుతోంది. తద్వారా నిఫ్టీ 11700స్థాయి దిగువకు చేరింది. డెరివేటివ్స్‌ ముగింపు, ఎన్నికల మూడో దశ పోలింగ్‌ వంటి అంశాల నేపథ్యంలో  అమ్మకాల ధోరణి నెలకొంది.

ఐటీ తప్ప అన్ని రంగాలూ బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో 1.6-1 శాతం మధ్య నష‍్టపోతున్నాయి. రిలయన్స్‌, కోటక్‌ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  వీటితోపాటు  పీఎస్‌యూ బ్యాంక్స్‌లో ఓబీసీ, యూనియన్‌, బీవోఐ, ఇండియన్‌, కెనరా, సిండికేట్‌, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, అలహాబాద్‌, బీవోబీ, జేఅండ్‌కే నష్టపోతున్నాయి.  ఇంకా భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ఆయిల్‌,  ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ వీక్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు