మార్కెట్లు పతనం : సర్జికల్‌ స్ట్రైక్‌ ఎఫెక్ట్‌?

26 Feb, 2019 09:31 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు,  భారత ప్రభుత‍్వం సర్జికల్‌ స్ట్రైక్‌ వార్తలతో ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది.నిఫ్టీ కూడా 90 పాయింట్లు పతనమైంది. అయితే వెంటనే కోలుకొని నష్టాలను246 పాయింట్లకు తగ్గించుకున్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 35,952వద్ద ఉంది. నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 10801 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి.

ఎస్‌బీఐ  సహా కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, యస్‌బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు అన్ని బ్యాంకు షేర్లు నష్టపోతున్నాయి. హీరో మోటో, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, వేదాంతా, అదానీ పవర్‌,  టైటన్‌ , సన్‌ ఫార్మ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, డిష్‌ టీవీ భారీగా  నష్టతున్నవాటిల్లో ఉన్నాయి. మరోవైపు కరెన్సీ బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. టీసీఎస్‌2 శాతం లాభంతో  52వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ కూడా లాభపడుతోంది.  

అటు దేశీయ కరెన్సీ డాలరు మారకంలో   రూపాయి ఆరంభంలో 40పైసలు నష్టపోయింది. వెంటనే తేరుకుని 30పైసల నష్టంతో 71.31వద్ద కొనసాగుతోంది. 

కాగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ క్యాంపులపై భారత వైమానిక దళం దాడులు చేసింది.  మంగళవారం తెల్లవారు ఝామున బాలాకోట్‌​ సమీపంలో ఉగ్రవాదస్థావరాలపై భారత సైనిక దళాలు  వెయ్యి కిలోల బాంబులతో  మెరుపు దాడులు చేశాయి.

మరిన్ని వార్తలు