లాభాల హుషారు: 10700 ఎగువకు నిఫ్టీ

19 Nov, 2018 14:39 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల మధ్య ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు, ఆర్‌బీఐ సమావేశం నేపథ్యంలో వరుసగా రెండో రోజుకూడా లాభాల పంట పండిస్తున్న కీలక సూచీలు మిడ్‌ సెషన్‌ తరువాత మరింత జోరుగా కదులుతున్నాయి. 247 పాయింట్లు పెరిగి 35,704వద్ద,  నిఫ్టీ 54 పాయింట్లు పుంజుకుని 10,736 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిఫ్టీ 10700 స్థాయిని దాటేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంక్స్‌, ఫార్మాతో  అన్ని సహా రంగాలూ లాభపడుతున్నాయి. రియల్టీ, మెటల్‌ ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు కూడా  పాజిటివ్‌గా ఉన్నాయి.  ఎస్‌ బ్యాంకు, డా.రెడ్డీస్‌, ఐషర్‌ మోటార్స్‌ ఎంఅండ్‌ఎం టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. జిందాల్‌ స్టీల్‌, హిందాల్కో, వేదాంతా, నాల్కో, వెల్‌స్పన్‌ కార్ప్‌, టాటా స్టీల్‌ సన్‌టెక్‌, ఒబెరాయ్‌, ఫీనిక్స్‌, యూనిటెక్‌, డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు