సాక్షి మనీ మంత్రా: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు

8 Nov, 2023 08:57 IST|Sakshi

Stock Market Updates: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. క్రితం రోజు బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప నష్టల్లో ముగిశాయి. సెన్సెక్స్ 16 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కేవలం 5 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. అదే క్రమంలో ఈరోజు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి సెన్సెక్స్‌ అత్యంత స్వల్పంగా 15 పాయింట్ల నష్టంతో 64,927 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల తేలికపాటి లాభంతో 19,413 వద్ద కొనసాగుతున్నాయి.

బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా లాభాల్లో పయనిస్తున్నాయి. హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌ కంపెనీ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నష్టాలను చవిచూస్తున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు